ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అరెస్ట్ పై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ ఆలంపూర్ నియోజకవర్గంలో పర్యటిస్తే ఒక మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ను గృహ నిర్బంధం చేసి అరెస్ట్ చేస్తారా.. ఇదేమన్నా రాజుల పాలనా.. అని మండిపడ్డారు. కేటీఆర్ కు ప్రజలు అడిగే సవాళ్ళను జవాబు చెప్పే ధైర్యం లేదా ? నియోజక వర్గంలో మూడేళ్ళ క్రితం వీరపురం దగ్గర మంత్రులు చేసిన శంకుస్థాపన చేసిన హ్యాండ్లూమ్ పార్క్ విషయాన్ని సంపత్ గుర్తు చేశారు. ప్రజా సమస్యలను సంబంధిత మంత్రి దృష్టికి తేవడం మాజీ ఎమ్మెల్యే గా ఆయన కనీస బాధ్యత..అని తెలిపారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని ఒక రాచరిక పాలనగా చేస్తుంది. ఇంతటి అణచివేత దేశంలోఎక్కడా లేదు..అణచివేత ఎక్కువైతే తిరుగుబాటు తప్పదు. తెలంగాణ చరిత్ర తెలుసుకొని కేసీఆర్ కుటుంబం నడుచుకోవాలి అని అన్నారు.