Common Service Centre: మనలో చాలామంది ఉద్యోగం లేదా వ్యాపారం చేయడం ద్వారా సొంత కాళ్లపై నిలబడి కెరీర్ లో సక్సెస్ కావాలని భావిస్తారు. అయితే వ్యాపారం చేయాలని అనుకునే వాళ్లకు ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇల్లు లేదా పొలం తాకట్టు పెట్టి లోన్ తీసుకోవాలన్నా సులభం కాదు. అయితే తక్కువ పెట్టుబడితో కొన్ని వ్యాపారాల ద్వారా ఎక్కువ మొత్తంలో సంపాదించవచ్చు.
డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా ఉమ్మడి సేవా కేంద్రాలను మొదలుపెట్టి సులువుగా డబ్బు సంపాదించవచ్చు. దేశవ్యాప్తంగా 4 లక్షలకు పైగా డిజిటల్ సేవా కేంద్రాలు ఉన్నాయనే విషయం తెలిసిందే. ఈ కేంద్రాల ద్వారా ఆరోగ్యం, విద్య, బ్యాంకింగ్, వ్యవసాయం, ఆర్థిక సేవలను అందించి డబ్బు పొందే అవకాశం ఉంటుంది. పది పాసై కంప్యూటర్ ను ఆపరేట్ చేయడం తెలిసి ఉంటే కామన్ సర్వీస్ సెంటర్ ను తెరవవచ్చు.
కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా ప్రభుత్వ పథకాల దరఖాస్తుతో పాటు రైలు ,విమాన టిక్కెట్లు బుక్ చేయడం, విద్యుత్ బిల్లుల చెల్లింపు, ఐటీఆర్ ఫైలింగ్, లైసెన్స్, పెన్షన్ దరఖాస్తు, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ దరఖాస్తు చేయవచ్చు. ఇందుకోసం 200 చదరపు మీటర్ల స్థలం, పవర్ బ్యాకప్, ప్రింటర్, ఇంటర్నెట్ కనెక్షన్, స్కానర్, వెబ్ క్యామ్ కూడా ఉండాలి. www.csc.gov.in వెబ్ సైట్ ద్వారా డిజిటల్ సేవా కేంద్రం కోసం దరఖాస్తు చేసుకోవాలి.
ప్రతి లావాదేవీకి ప్రభుత్వం నుంచి ఏకంగా 11 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. టికెట్లు బుక్ చేయడం ద్వారా 10 నుంచి 20 రూపాయల వరకు సంపాదించవచ్చు. డిజిటల్ సేవా కేంద్రాల ద్వారా బిల్లుల చెల్లింపు. ప్రభుత్వ పథకంలో నమోదు చేసి ఇలా చేయడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు.