Telugu News » Ap » Meeting of ap representatives with krmb chairman
కేఆర్ఎంబీ ఛైర్మన్ తో ఏపీ ప్రతినిధుల భేటీ
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్ ఎంపీ సింగ్ తో ఏపీ నీటి సంఘాల ప్రతినిధులు భేటీ అయ్యారు. హైదరాబాద్ జలసౌధలో కృష్ణా డెల్టా, సాగర్ ఆయకట్టు ప్రతినిధులు ఆయనతో సమావేశమయ్యారు. తెలంగాణ తీరుతో ఏపీ రైతులు నష్టపోతున్నారని ఫిర్యాదు చేశారు. కష్ణా జలాల సమస్యపై రెండు తెలుగు రాష్ట్రల మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరు రాష్ట్రాల నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సమస్యను వివరించేందుకు ఏపీ నీటి సంఘాల ప్రతినిధులు […]
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్ ఎంపీ సింగ్ తో ఏపీ నీటి సంఘాల ప్రతినిధులు భేటీ అయ్యారు. హైదరాబాద్ జలసౌధలో కృష్ణా డెల్టా, సాగర్ ఆయకట్టు ప్రతినిధులు ఆయనతో సమావేశమయ్యారు. తెలంగాణ తీరుతో ఏపీ రైతులు నష్టపోతున్నారని ఫిర్యాదు చేశారు. కష్ణా జలాల సమస్యపై రెండు తెలుగు రాష్ట్రల మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరు రాష్ట్రాల నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సమస్యను వివరించేందుకు ఏపీ నీటి సంఘాల ప్రతినిధులు కేఆర్ఎంబీ ఛైర్మన్ ను కలిశారు.