
దళిత, గిరిజన ఆత్మ గౌరవ దీక్ష లో భాగంగా రాత్రి మూడు చింతలపల్లి లోని దళిత వాడలో బస చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెల్లవారుజామున దళిత వాడ అంత ఇంటింటికి తిరిగి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి, విద్య, ఆరోగ్య సమస్యలపై ఆరా తీశారు. అనంతరం అక్కడ నుంచి కలెక్టర్ హరీష్ కు ఫోన్ చేసి మాట్లాడారు. ఇక్కడ సమస్యలను వివరించి వెంటనే పరిష్కరించాలని సూచించారు.