
ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారతీయుల తరలింపును కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. మంగళవారం మరో 78 మంది భారత్ కు వచ్చారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా 16 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా మొత్తం 78 మందిని అధికారులు క్వారంటైన్ కు తరలించారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఇప్పటి వరకు 626 మంది భారత్ కు వచ్చారని కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పూరి తెలిపారు.