Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈసారి అధికారమే లక్ష్యంగా పార్టీ చాలా వరకు కష్టపడింది. అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ సైతం ప్రచారాలు నిర్వహించారు. బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ప్రజలకు భరోసాలిచ్చి అధికారంలోకి వచ్చేందుకు ఎంతగానో కృషి చేశారు. మరోవైపు.. రేవంత్ రెడ్డి ఫైర్ కూడా పార్టీకి చాలా వరకు కలిసొచ్చింది. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో అప్పటి నుంచే పార్టీ పూర్తిగా ట్రాక్ లోకి వచ్చిందని అందరికీ తెలిసిందే. ఆయన చరిష్మా, గత ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించారు.
అయితే.. రేవంత్ అంటే ముందు నుంచీ అధిష్టానంలో మంచి అభిప్రాయమే కనిపించింది. కానీ.. ఈ మధ్య కాంగ్రెస్ అగ్రనేత రాహుల్, రేవంత్ మధ్య గ్యాప్ వచ్చినట్లుగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే.. వారి ఆరోపణలను ఇప్పటివరకు అందరూ లైట్ తీసుకున్నప్పటికీ నిన్న రేవంత్ జన్మదినం సందర్భంగా మరోసారి రుజువైందని తెలుస్తోంది. నిన్న రేవంత్ రెడ్డి పుట్టినరోజు. దాంతో చాలా మంది విష్ చేశారు. పార్టీలకతీతంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ మాత్రం రేవంత్ పుట్టినరోజు అంశాన్ని పట్టించుకోలేదు. ఆయన కనీసం ట్విట్టర్ ద్వారా కూడా శుభాకాంక్షలు చెప్పలేదు. దాంతో ఇద్దరి మధ్య సంబంధాలు చెడినట్లేనని బీఆర్ఎస్ నేతలు ఆనందిస్తున్నారట. వాళ్ల ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉన్నప్పటికీ.. ప్రచారం మాత్రం జోరుగా జరుగుతోంది.
వీరి ప్రచారం ఇలా ఉంటే.. ముఖ్యమంత్రికి రాహుల్ నేరుగా ఫోన్ చేసి విష్ చేశారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ.. సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా కనిపించకపోవడం విశేషం. సోషల్ మీడియాలో కాకుండా నేరుగా ఫోన్ చేసినట్లు వారు వాదిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు మాత్రం రాహుల్ ఫోన్ చేయలేదంటూ సెటైర్లు వేస్తోంది. అయితే.. తనకు ఎందుకు విష్ చేయలేదని రేవంత్ రెడ్డి హైకమాండుతో లొల్లికి వెళ్లే పరిస్థితి ఉండదు. అయితే.. యంగ్ స్టర్ అయిన రేవంత్ ఫ్యూచర్లో దక్షిణాదిలో పిల్లర్‌గా మారుతారని భావిస్తున్న రేవంత్ రెడ్డిని దూరం చేసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ హైకమాండ్‌కు అయితే లేదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ ఎలా అయితే కాంగ్రెస్ పార్టీని నడిపించి అధికారంలోకి తీసుకొచ్చారో రేవంత్ కూడా అదే ధోరణిలో కనిపిస్తున్నారు. వైఎస్సార్ లాగే పార్టీని నడిపిస్తూనే.. వైఎస్సార్ లానే ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారన్న టాక్ ఉంది. కానీ.. బీఆర్ఎస్ మాత్రం మరొలా ఉంది. రేవంత్‌ను ఎలా అయినా హైకమాండ్‌కు దూరం చేస్తే.. ఆయన నమ్మకం తగ్గిస్తే చాలనే కాన్సెప్టుతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులోభాగంగానే ఏవేవో కుట్రలకు పోతున్నట్లుగానూ ప్రచారం వినిపిస్తోంది. రేవంత్‌కు పీసీసీ అధ్యక్షుడి పదవి రాకముందు ఏమేం చేశారో అక్కర్లేదు. ఒకానొక సందర్భంలో గాంధీభవన్‌లో గాడ్సే అంటూ కేసీఆర్ చెప్పారు. రేవంత్ కాంగ్రెస్‌లో లేకపోతే ఆ పార్టీ ఎక్కడికి వెళ్లిపోతుందో కూడా జోస్యం చెప్పారు. అందుకే ఈ రాజకీయాలు కాంగ్రెస్‌కు బాగా తెలుసు. అందుకే.. రేవంత్ రెడ్డిని టచ్ చేస్తారని ఎవరూ అనుకోవడం లేదు. ఒకవేళ హైకమాండ్‌తో రేవంత్‌కు ఏమైనా గ్యాప్ ఏర్పడితే దానిని కన్విన్స్ చేసుకునే అంత కెపాసిటీ కూడా ఆయనకు ఉంది. అంతే తప్పితే హైకమాండుతో వివాదం పెంచుకుంటారని ఎవరూ అనుకోవడం లేదు. కానీ.. బీఆర్ఎస్ మాత్రం రేవంత్‌ను కార్నర్ చేస్తూ ఆయన పోస్టుకు ఎసరు తేవాలనే ప్రయత్నాలు మాత్రం వదలడం లేదు. ఈ క్రమంలో రాహుల్ మెస్సేజ్ చేయకోవడంపై భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయన్న హాట్ హాట్ చర్చ అయితే నడుస్తోంది.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: Revanth also seems to be following the same trend as ysr congress led the congress party to power in the united state
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com