
కరోనా పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డీజీపీ, కార్మిక, జైళ్ల శాఖలు, జీహెచ్ఎంసీ హైకోర్టుకు నివేదిక సమర్పించాయి. రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచుతున్నామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ తెలిపారు. గత నెల 29న లక్ష కరోనా పరీక్షలు నిర్వహించామని గుర్తు చేశారు. రెండో దశ ఫీవర్ సర్వేలో 68.56 శాతం మందికి పరీక్షలు నిర్వహించామన్నారు. ప్రయివేట ఆస్పత్రులపై వచ్చిన ఫిర్యాదులు పరిశీలిస్తున్నామని చెప్పారు. ఫిర్యాదుల పరిశీలనకు ముగ్గురు ఐఏఎస్ లతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.