
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను ట్విట్టర్ వేదికగా బాలీవుడ్ నటుడు సోనూసూద్ ప్రశంసించారు. కేటీఆరే నిజమైన హీరో అంటూ కొనియాడారు. కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని సోనూసూద్ పేర్కొన్నారు. అయితే నంద కిశోర్ అనే ఓ నెటిజన్ కేటీఆర్ కు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశాడు. తాము సంప్రదించిన 10 గంటలలోపే తమకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ సమాకూర్చారని తెలిపారు. నిజమైన సూపర్ హీరో కేటీఆర్ అని నంద కిశోర్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పై మంత్రి కేటీఆర్ స్పందించారు. సూపర్ హీరో తాను కాదు సూపర్ హీరో అని మీరు సోనూసూద్ ను పిలవచ్చు అని కేటీఆర్ రీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై సోనూసూద్ స్పందిస్తూ కేటీఆర్ కు థ్యాంక్స్ చెప్పారు.