TTD: రేణిగుంట ఎయిర్ పోర్టుకు శ్రీవారి పేరు పెట్టాలని ధర్మకర్తల మండలి ప్రతిపాదించిందని , పేరు మార్పుపై ఏవియేషన్ సంస్థకు లేఖ రాయాలని నిర్ణయించినట్టు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర భేటీ ముగిసింది. అనంతరం సమావేం వివరాలను బీఆర్ నాయుడు మీడియాకు వివరించారు. బెంగళూరులో శ్రీవారి ఆలయం పెద్దది నిర్మించాలని డిప్యూటీ సీెం డీకే శివకుమార్ కోరారు.