Reliance-JV Data Hub In Vizag: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ విశాఖను రాజధానిగా ప్రకటించింది. ఎంతో అభివృద్ధి చేస్తామని చెప్పి ఐదేళ్లపాటు కాలం గడిపింది. కానీ కూటమి అలా కాదు. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే విశాఖను అగ్ర పధంలో నిలిపేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. ప్రపంచ దిగ్గజ సంస్థలు తమ కార్యకలాపాలతో పాటు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కానుంది. ఇప్పుడు తాజాగా మరో దిగ్గజ సంస్థ సైతం తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధపడుతోంది. రిలయన్స్ సంస్థ లక్ష కోట్ల డేటా హబ్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ఒప్పందం కూడా చేసుకుంది. నిజంగా ఇది విశాఖకు గేమ్ చేంజర్ గా మారుస్తుంది. మరిన్ని అనుబంధ పరిశ్రమలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
* వ్యూహం ప్రకారం ముందడుగు..
విశాఖ నగరంలో( Visakha City ) ఐటీ అనుబంధ పరిశ్రమల విస్తరణలో కూటమి ప్రభుత్వం ఒక వ్యూహం ప్రకారం ముందడుగు వేస్తోంది. ప్రభుత్వ ప్రయత్నాలు సైతం ఫలిస్తున్నాయి. ప్రభుత్వం తరఫున రాయితీలు, భూ కేటాయింపులు త్వరితగతిన జరుగుతుండడంతో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రూక్ ఫీల్డ్, డిజిటల్ రియాల్టీ ల మధ్య జాయింట్ వెంచర్ గా ఏర్పడిన డిజిటల్ కనెక్షన్ 1 గిగా వాట్ ఏఐ నేటివ్ డేటా సెంటర్ల నిర్మాణానికి ముందుకు వచ్చింది. సుమారు 11 బిలియన్ల డాలర్లు అంటే లక్ష కోట్లు ఇన్వెస్ట్ చేయబోతున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. విశాఖ డేటా క్యాపిటల్ ఆఫ్ ఇండియాకు మారుతోందని ఆనందం వ్యక్తం చేశారు.
* 2030 నాటికి ప్రాజెక్ట్..
విశాఖలో ఏర్పాటు చేయబోయే ఈ ప్రాజెక్టుకు 400 ఎకరాల స్థలం ఏపీ ప్రభుత్వం( AP government) సమకూర్చనుంది. 2030 నాటికల్లా ఇది పూర్తవుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుతో ఎంవోయి కూడా చేసుకున్నారు. గూగుల్ డేటా సెంటర్ తర్వాత ఇది రెండో పెద్ద ఇన్వెస్ట్మెంట్ గా నిలవనుంది. అయితే ఈ గూగుల్ డేటా సెంటర్ల రాకతో అనుబంధ పరిశ్రమలు పెద్ద ఎత్తున విశాఖకు రానున్నాయి. కూటమి ప్రభుత్వం ఐటి హబ్ గా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు సైతం ఫలించునున్నాయి. లక్షలాదిమందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది భవిష్యత్తులో. అయితే అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తుండడం మాత్రం ఆశ్చర్యపరుస్తోంది. భవిష్యత్తులో విశాఖ నగరం మరింత అభివృద్ధి చెంది దేశంలోనే గుర్తింపు పొందిన నగరంగా ఎదగడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
* వైసీపీకి ఇబ్బందికరమే..
అయితే కూటమి ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తుండడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఐదేళ్ల వైసిపి పాలనలో ఎటువంటి పరిశ్రమలు రాకపోగా.. ఉన్న పరిశ్రమలను బలవంతంగా తరలించారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తుండడంతో అప్పటి వైఎస్సార్ కాంగ్రెస్ పాలన గుర్తు చేసుకుంటున్నారు విద్యాధికులు. ఇది నిజంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమే. ప్రభుత్వ పెద్దల వరుస విదేశీ పర్యటనలు, పెట్టుబడుల సదస్సుల ఏర్పాటు వంటివి సత్ఫలితాలను ఇస్తున్నాయి. పరిశ్రమల రాకతో కూటమి ప్రభుత్వ పరపతి పెరుగుతోంది. సహజంగానే ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైన చర్య.