TG Registration Prices Increase: రిజిస్టేషన్ మార్కెట్ విలువల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు మధ్యలో ని స్థిరాస్తి లావాదేవీలనపై రిజిస్టేషన్ మార్కెట్ ధరలను పెంచాలని యోచిస్తోంది. అపార్ట్ మెంట్స్ పై 30 శాతం, ఓపెన్ ప్లాట్లపై వంద శాతం, అంతకంటే ఎక్కువ పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. మార్కెట్ విలువల మార్గదర్శక నియమాల ప్రకారం ముందుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.