
దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 39,070 కేసులు వెలుగులోకి రాగా 491 మరణాలు సంభవించాయి. తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 4,27,862కి చేరింది. తాజాగా నమోదైన కేసుల కంటే రికవరీలే ఎక్కువగా నమోదయ్యాయి. దేశంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,10,99,771కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,06,822 యాక్టివ్ కేసులు ఉన్నాయి.