
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రాజస్థాన్ పై సునాయాసంగా విజయం సాధించింది. మొదట బాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. కొద్దీ పాటి లక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లీ సేన 19.1ఓవర్లలో 2వికెట్ల నష్టం తో 158పరుగులు చేసి విజయాన్ని కైవసం చేసుకుంది. పడిక్కాల్ 63, విరాట్ కోహ్లీ 72 పరుగులు చేశారు.