
ఐపీఎల్ 2021 మలిదశలో తాము ఆడనున్న తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్లూ జెర్సీతో బరిలో దిగనుంది. దేశంలో కొవిడ్ కట్టడికి పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ కు మద్దతుగా నిలిచేందుకు ప్రత్యేకంగా ఈ జెర్సీతో ఆడనున్నట్లు ఆర్సీబీ తెలిపింది. ఫ్రంట్ లైన్ వారియర్స్ ధరించే పీపీఈ కిట్ల రంగును సూచించేలా ఉండేందుకు ఈ కలర్ ను ఎంచుకున్నట్లు వెల్లడించింది.