
హైదరాబాద్ లో సింగరేణి కాలనీలో హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబాన్ని నటుడు మంచు మనోజ్ పరామర్శించాడు. ఘటన చాలా బాధాకరమన్న మంచు మనోజ్.. ఈ దారుణానికి పాల్పడ్డ దుర్మార్గుడిని ఉరి తీయాలని వ్యాఖ్యానించాడు. ఆ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సాయితేజ్ ప్రమాదాన్ని త్రీడీ రూపంలో చూపిస్తున్న టీవీ ఛానెళ్లు.. ఆరేళ్ల చిన్నారి ఘటనను ఎందుకు చూపించడం లేదని మంచు మనోజ్ ప్రశ్నించాడు.