
కోల్ కతా నైట్ రైడర్స్ చేతులో ఆర్సీబీ దారుణంగా ఓడటంతో ఆ టీమ్ పై, విరాట్ కెప్టెన్సీ పై విమర్శలు ఎక్కువయ్యాయి. ఎలాంటి ఫైట్ లేకుండానే ఆర్సీబీ చేతులెత్తేసింది. కేవలం 92 పరుగులకే చాప చుట్టేసింది. ఓపెనర్ గా వచ్చిన విరాట్.. బ్యాట్ తో నూ దారుణంగా విఫలమయ్యాడు.
దీంతో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే0 కోహ్లిని కెప్టెన్సీ నుంచి తప్పించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు వార్తా సంస్థ తో ఓ మాజీ క్రికెటర్ అన్నాడు. ఇప్పటికే వచ్చే సీజన్ నుంచి కెప్టెన్ గా ఉండబోనని అతడు ప్రకటించిన సమయాన్ని గంభీర్ లాంటి మాజీలు తప్పుపడుతుండగా.. ఈ మాజీ క్రికెటర్ మాత్రం మరిన్ని సంచలన కామెంట్స్ చేశాడు. కోల్ కతాతో మ్యాచ్ లో వాళ్లు ఆడిన తీరు చూడండి. ఏం చేయాలో పాలుపోనట్లు కనిపించారు.
చాలా ఇబ్బందుులు పడుతున్నారు. కోహ్లిని సీజన్ మధ్యలోనే కెప్టెన్సీ నుంచి తొలగించే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఇతర టీమ్స్ విషయంలో ఇలా జరిగింది. దినేష్ కార్త్ ను కేకేఆర్, సన్ రైజర్స్ డేవిడ్ వార్నర్ ను తొలగించాయి. కొందరిని తొలగించారు. మరికొందరు వాళ్లుకు వాళ్లుగా తప్పుకున్నారు. ఆర్సీబీ విషయంలోనూ అదే జరగొచ్చు. మరొపక్క మ్యాచ్ చెత్తగా ఆడారంటే కోహ్లిని కచ్చితంగా కెప్టెన్సీ నుంచి తప్పిస్తారు అని ఆ మాజీ క్రికెటర్ స్పష్టం చేశాడు. 2013 లో ఆర్సీబీ కెప్టెన్సీ చేపట్టిన విరాట్ 132 మ్యాచ్ లలో కేవలం 62 మ్యాచ్ లలోనే గెలిపించగా 66 ఓడిపోయాడు.