CSK poor performance ఐపీఎల్ లో ఘనమైన చరిత్ర ఉన్న జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ కు పేరు ఉంది. ధోని నాయకత్వంలో చెన్నై జట్టు ఐదుసార్లు విజేతగా నిలిచింది. 2023 లో కూడా చెన్నై జట్టు ఛాంపియన్ గా అవతరించింది. చెన్నై జట్టు ధోని నాయకత్వంలో ఐదుసార్లు ట్రోఫీలు గెలవడం ద్వారా.. ముంబై జట్టు సరసన నిలిచింది.
అద్భుతమైన చరిత్ర ఉన్న చెన్నై జట్టు ప్రస్తుతం తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నది. ఐపీఎల్ లో వరుస ఓటములతో ఇబ్బంది పడుతున్నది. ధోని జట్టులో లేకపోవడం.. కీలకమైన ప్లేయర్లను మేనేజ్మెంట్ నిలుపుకోలేకపోవడం.. ఉన్న ప్లేయర్లు సక్రమంగా ఆడక పోవడంతో చెన్నై జట్టు తీవ్రస్థాయిలో విమర్శలను ఎదుర్కొంటున్నది. అదే స్థాయిలో ఓటములను చవిచూస్తున్నది. గత సీజన్లో అద్వానంగా ఆడిన చెన్నై జట్టు.. ఈ సీజన్లో కూడా దారుణమైన ఆట తీరు ప్రదర్శిస్తుంది. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్లలోనూ చెన్నై జట్టు ఓటమిపాలైంది. చెన్నై బౌలర్లు ఏమాత్రం ప్రతిభ చూపించలేకపోతున్నారు. బ్యాటర్లు కూడా తమ స్థాయి ఆట తీరు ప్రదర్శించలేకపోతున్నారు.
చెన్నై జట్టు బౌలర్లు ఆదివారం బెంగళూర్ తో జరిగిన మ్యాచ్లో ధారాళంగా పరుగులు ఇచ్చారు. చివరి 5 ఓవర్లలో ఓవర్ కు 19 చొప్పున పరుగులు ఇవ్వడం వారి బౌలింగ్ లోపానికి బలమైన నిదర్శనం. అంతటి స్కోర్ ఇవ్వడం పట్ల చెన్నై బౌలర్ల పై ఆ జట్టు మాజీ ఆటగాళ్లు తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. చెన్నై జట్టు బౌలింగ్లో క్రమశిక్షణ లోపించిందని మండిపడుతున్నారు..
చెన్నై బౌలర్ల బౌలింగ్ తీరుపై ఆ జట్టు మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశాడు.. ” నేను అనవసరంగా రిటైర్మెంట్ ప్రకటించాను. ఇంకా ఆడి ఉంటే బాగుండేది. ఇప్పుడు అనిపిస్తోంది ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నానా అని.. జట్టులో ప్లేయర్లు సరిగా ఆడటం లేదు. బౌలర్లు సమర్థవంతంగా బంతులు వేయడం లేదు. వారి ప్రదర్శన చూస్తుంటే బాధ కలుగుతోంది. అసలు ఇలా ఎందుకు ఆడుతున్నారో అర్థం కావడం లేదని” అశ్విన్ ఆవేదన వ్యక్తం చేశాడు. అశ్విన్ మాటలతో చెన్నై అభిమానులు ఏకీభవిస్తున్నారు. జట్టు బౌలింగ్ ఇప్పటికైనా మారాలని సూచిస్తున్నారు.