
పెరుగుతున్న కరోనా వ్యాప్తి మరింత వినాశనానికి దారితీస్తోంది. తాజాగా రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్ష్యుడు చౌదరి అజిత్ సింగ్ కరోనాతో కన్నుమూశారు. కరోనా బారిన పడి ఆయన గురుగ్రామ్ లోని మెదాంత ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందుతూ కన్నమూశారు. 82 సంవత్సరాల వయసులో చౌదరి అజిత్ సింగ్ తుది శ్వాస విడిచారు. చౌదరి అజిత్ సింగ్ ఏప్రిల్ 22 న కరోనా బారిన పడ్డారు. అనంతరం చికిత్స కోసం గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. ఊపిరిత్తులలో ఇన్ఫెక్షన్ కారణండా అతని పరిస్థితి ఆందోళనకరంగా మారింది. చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.