Dhurandhar 2 : ప్రతీ హీరో అభిమాని కూడా తమ అభిమాన హీరో కెరీర్ లో ఇలాంటి అద్భుతమైన సినిమా ఉండాలి అని కోరుకునే బ్లాక్ బస్టర్స్ లో ఒకటి ‘ధురంధర్'(Dhurandhar Movie). గత ఏడాది డిసెంబర్ 4న విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ ఎంత ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 1370 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఇప్పటికీ థియేటర్స్ లో నడుస్తూనే ఉంది. కమర్షియల్ గా ఎంత సక్సెస్ సాధించింది అనే విషయాన్నీ పక్కన పెడితే, ఈమధ్య కాలంలో థియేటర్స్ లో ఆడియన్స్ కి రోమాలు నిక్కపొడుచుకునేలా చేసిన ఏకైక చిత్రం ఇదే. అందుకే ఇలాంటి సినిమా మా హీరో కెరీర్ లో కూడా ఉండుంటే బాగుండేది అని అందరూ అనుకునేలా చేసింది. అలాంటి సినిమా రణవీర్ సింగ్ కెరీర్ లో ఉన్నందుకు నిజంగా అదృష్టవంతుడే.
రణవీర్ సింగ్(Ranveer Singh) కి ఈ చిత్రానికి ముందు వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ ఉన్నాయి. ఆయన కెరీర్ లో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి కానీ, ఈ చిత్రం ఆయన్ని ఇండియా లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ని చేసింది. అయితే ఈ సినిమాలో నటించినందుకు ఆయన భారీ రెమ్యూనరేషన్ తీసుకోలేదు కానీ, ‘ధురంధర్ 2’ కి మాత్రం కళ్ళు చెదిరే రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్టు సమాచారం. అది ఎంతంటే అక్షరాలా 120 కోట్ల రూపాయిలు అన్నమాట. ఓటీటీ లో నెట్ ఫ్లిక్స్ థియేట్రికల్ రైట్స్ సీక్వెల్ కి దాదాపుగా 350 కోట్ల రూపాయిలు ఉంటాయి. హిందీ తో పాటు అన్ని ప్రాంతీయ బాషల బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో ఉంటుంది. కేవలం ప్రీ రిలీజ్ బిజినెస్ వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ఉన్నప్పుడు, రణవీర్ సింగ్ 120 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకోవడం లో ఎలాంటి తప్పు లేదు.
అయితే సోషల్ మీడియా లో ఈ విషయం తెలుసుకున్న కొంతమంది నెటిజెన్స్, 120 కోట్లా?, అంత బడ్జెట్ తో ఒక మీడియం రేంజ్ పాన్ ఇండియన్ సినిమాని చేసేయొచ్చు అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే షూటింగ్ సెట్స్ లో రణవీర్ సింగ్ కి మేకర్స్ రాయల్ ట్రీట్ మెంట్ ఇవ్వాలట. కేవలం లొకేషన్ లో ఆయన పనులు చూసుకోవడం కోసం మూడు క్యార వ్యాన్స్ ని ఏర్పాటు చేయాలట. వాటితో పాటు రణవీర్ సింగ్ సిబ్బంది కి కూడా కార్లు మైంటైన్ చేయాలట. ఈ ఖర్చులే దాదాపుగా పది కోట్ల రూపాయిల వరకు ఉంటుందని సమాచారం. ఒకవేళ ఇలాంటి హీరోలు మన టాలీవుడ్ లోకి వచ్చి సినిమాలు చేసే పరిస్థితి వస్తే మన నిర్మాతలు తట్టుకోగలరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.