Pawan Kalyan Birthday Special Article: పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్… జనం కోసం పుట్టిన హీరో ‘పవర్ స్టార్’

Pawan Birthday Special Article: పవర్ స్టార్.. ఆ పేరు వింటేనే ఒక వైబ్రేషన్.. పవన్ కళ్యాణ్ ఆ పేరులోనే ఒక సెన్షేషన్.. ఆయన చూపు ఒక బ్రహ్మాస్త్రం.. ఆయన మాట ఒక శాసనం.. పవన్ పేరు చెబితే చాలు అభిమానుల్లో అలుపెరగని ఉత్సాహం.. అది తెరపైన అయినా.. తెర బయట అయినా సరే పవన్ కనిపిస్తే పూనకాలే.. హీరోకి అభిమానులు ఉండడం వేరు.. తన వ్యక్తిత్వంతో కోట్లాది మంది ప్రాణపద అభిమానులను సంపాదించుకోవడం వేరు.. హీరోలందరిలో […]

Written By: NARESH, Updated On : September 2, 2021 12:52 pm
Follow us on

Pawan Birthday Special Article: పవర్ స్టార్.. ఆ పేరు వింటేనే ఒక వైబ్రేషన్.. పవన్ కళ్యాణ్ ఆ పేరులోనే ఒక సెన్షేషన్.. ఆయన చూపు ఒక బ్రహ్మాస్త్రం.. ఆయన మాట ఒక శాసనం.. పవన్ పేరు చెబితే చాలు అభిమానుల్లో అలుపెరగని ఉత్సాహం.. అది తెరపైన అయినా.. తెర బయట అయినా సరే పవన్ కనిపిస్తే పూనకాలే.. హీరోకి అభిమానులు ఉండడం వేరు.. తన వ్యక్తిత్వంతో కోట్లాది మంది ప్రాణపద అభిమానులను సంపాదించుకోవడం వేరు.. హీరోలందరిలో పవర్ స్టార్ వేరయా అన్నట్టుగా సాగే జనసేనాని 50వ పుట్టినరోజు  నేడు(సెప్టెంబర్ 2). ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఆయన జీవిత, సినీ, రాజకీయ ప్రస్థానంపై స్పెషల్ ఫోకస్..

జనం కోసం పుట్టిన హీరో పవన్ కళ్యాణ్ (Pavan Kalyan).. ఆయనకు జనంలో ఉండడం ఇష్టం.. జనం మెచ్చేలా.. జనాన్ని మెప్పించేలా బతకడం ఇష్టం.. జనం కోసం ఏం చేయడానికైనా ఆయన సిద్ధం.. అలాంటి జననాయకుడు వెండితెర ఇలవేల్పుగా.. రాజకీయ నాయకుడిగా అందరికీ అందుబాటులో ఉండే మనిషిగా.. ఒక పరిపూర్ణ సాహయకారిగా మన ముందు నిలబడ్డాడు..

సినిమాలతో సంబంధం లేకుండానే ఎల్లవేళలా అభిమానులు పవన్ వెంట ఉంటారు.. మిగతా హీరోలకు పవన్ కు అదే తేడా.. అన్నయ్య చిరంజీవి (Chiranjeevi) తర్వాత అంతటి అభిమానాన్ని సొంతం చేసుకున్న ఏకైక హీరో పవన్ కళ్యాణ్.. ఎన్ని సినిమాల్లో నటించాడు? ఎన్ని హిట్ అయ్యాయి? ఎన్ని ఫ్లాప్ అయ్యాయన్నది సంబంధం లేకుండా పవన్ అంటే చాలు ప్రాణమిచ్చే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. సినిమాలు హిట్టూ ఫట్టూతో సంబంధం లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న ఏకైక హీరో పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చు.. ఏళ్ల పాటు హిట్ లేకున్నా పవన్ ఇమేజ్ మాత్రం చెక్కుచెదరలేదంటే అతిశయోక్తి కాదు.. ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మిగతా ఏ హీరోకు లేదనడంలో సందేహం లేదు.

-పవన్ కళ్యాణ్ ప్రస్థానం..
పవన్ కళ్యాణ్ ఇంటర్ మీడియెట్ తో చదువును ఆపేశాడు. అనంతరం మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నాడు. కళ్యాణ్ బాబు అనే పేరును ‘పవన్ కళ్యాణ్’ మార్చుకొని 1996లో ‘అక్కడ అమ్మాయి-ఇక్కడ అబ్బాయి’ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన గోకులంలో సీత, సుస్వాగతం సినిమాలతో హీరోగా టాలీవుడ్ లో నిలదొక్కుకున్నాడు. 1999లో విడుదలైన ‘తొలిప్రేమ’ మూవీ పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి ఆయన జీవితాన్ని మలుపుతిప్పింది. ఆ తర్వాత ‘తమ్ముడు’, ఖుషి, జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, గోపాల గోపాల, వకీల్ సాబ్ సినిమాలు పవన్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ మూవీస్ అని చెప్పొచ్చు.

‘గబ్బర్ సింగ్’ సినిమాకు గాను తెలుగులో ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును పవన్ అందుకున్నాడు. ‘అత్తారింటికి దారేది’ మూవీ వసూళ్లలో అప్పటి వరకు తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న రికార్డులను అన్నింటిని బద్దలు కొట్టింది. ‘అజ్ఞాతవాసి’ మూవీ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు.

ఇక రీఎంట్రీలో ‘వకీల్ సాబ్’తో పవన్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. కరోనా సమయంలోనూ విడుదలైన రికార్డు వసూళ్లను సాధించింది ఈ చిత్రం. ‘వకీల్ సాబ్’ తర్వాత వరుసగా మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ‘బీమ్లా నాయక్’, హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో మూవీని అనౌన్స్ చేశాడు.

* పవన్ కళ్యాణ్ హీరోగానే కాదు.. సినిమా నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. అంజనా ప్రొడక్షన్స్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లతో నిర్మాతగా వ్యవహరించారు. అప్పట్లో వచ్చిన ‘ముగ్గురు మొనగాళ్లు, సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాలకు నిర్మాతగా పవన్ వ్యవహరించారు.

*ఇక దర్శకుడి పవన్ కళ్యాణ్ తొలి చిత్రం జానీ.. 2003లో ఈ సినిమా విడుదలైంది. ఇక తన సినిమాల్లో కొన్నింటిని స్టంట్స్ ఫైట్ మాస్టర్ గానూ మారి పవన్ ఫైట్స్ కంపోజ్ చేయడం విశేషం. జానీ, గుడుంబా శంకర్, సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాలకు కథా సహకారం కూడా అందించి అన్ని రంగాల్లోనూ తన ప్రతిభను పవన్ చాటాడు.

-రాజకీయాల్లో జనసేనానిగా ఎంట్రీ
సినిమాల్లో స్టార్ హీరోగా వెలిగిన పవన్ లో ఏదో అసంతృప్తి.. జనానికి ఏదో ఒకటి చేయాలని తపన పడేవాడు. ఆ కోరికతోనే రాజకీయాల్లోకి వచ్చాడు. 2014 మార్చి 14న జనసేన పార్టీని పవన్ స్థాపించాడు. కుల, మత, ప్రాంతీయ పక్షపాతాలు లేకుండా భారతీయుడినని ప్రకటించిన నిస్వార్థ రాజకీయ నేత పవన్. జాతి సమైక్యత, సమగ్రతే ధ్యేయం అంటూ రాజకీయాల్లోకి వచ్చాడు. అంతకుముందు అన్నయ్య చిరంజీవి ‘ప్రజారాజ్యం’ కూడా పనిచేశాడు. 2014 ఎన్నికల వేళ ఏపీలో పోటీచేయకుండా మోడీకి, చంద్రబాబుకు మద్దతు పలికి బీజేపీ-టీడీపీ కూటములు గెలుపులో కీలక పాత్రను పవన్ పోషించారు.

-పోరాటాల్లో అలుపెరగని బాటసారి
రాజకీయాల్లో ఉన్నత విలువలు ఆశయాలతో పవన్ ప్రస్థానం సాగింది. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం పవన్ చేశాడు. సమస్యలు పరిష్కరించని సొంత ప్రభుత్వాలు బీజేపీ, టీడీపీని కూడా నిలదీసిన చరిత్ర పవన్ సొంతం. ఉద్దానం, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ , అమరావతి రైతు సమస్యలు సహా ఎన్నో అన్యాయాలు, అక్రమాలపై ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజస్వామ్య పద్ధతిలో పవన్ పోరాడి పాలకుల్లో కదలిక తెచ్చాడు. 2019 ఎన్నికల్లో బీజేపీ-టీడీపీలతో విభేదించి ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగాడు.

రాజకీయాల్లో ఎవరెన్ని కుట్రలు చేసినా జనం మెచ్చినా నాయకుడిగా పవర్ స్టార్ గా పవన్ కళ్యాణ్ ప్రజల గుండెల్లో ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాడు. తాను సినిమాల్లోకి వెళ్లింది కేవలం ప్రజాసేవ కోసమేనని.. ఆ డబ్బులతో రాజకీయ పార్టీని నడపేందుకేనని అవినీతి రాజకీయ స్థాపనకు పవన్ గొప్ప ముందడుగు వేశాడు. ఆయన సినిమాల్లో ఉన్నా.. రాజకీయాల్లో ఉన్న నమ్మిన సిద్ధాంతాల కోసం నీతి నిజాయితీలతో ముందుకెళుతున్నారు. సాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్నాడు. పైకి తెలిసినవి కొన్నే.. తెలియని ఎన్నో సాయాలు పవన్ చేశాడు.. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. అందుకే ఎంత మంది స్టార్లు వచ్చినా.. రాజకీయ నేతలు వచ్చినా పవన్ మాత్రం ‘జనం’ గుండెల్లోనే పదిలంగా ఉన్నాడు..

 పవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా ఆయనకు oktelugu.com తరుపున మనస్ఫూర్తిగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతాం.. ‘జై హో పవన్ కళ్యాణ్..’