
రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో తెలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ వరకు సముద్ర మట్టానికి 1.5-2.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది.