https://oktelugu.com/

‘ఆక్సిజన్’ సమస్యకు ఇక చెక్ పడినట్టే!

కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న వేళ గతంలో కేసులు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం కసులు తగ్గినా మరణాల రేటు మాత్రం తగ్గడం లేదు. దీంతో ప్రజలు భయాందోళన వ్యక్త్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా తగ్గుతోంది. కరోనా కేసులు లేకపోయినా ఆక్సిజన్ మరణాలు మాత్రం ఎక్కడా నమోదు కావడం లేదు. ఆక్సిజన్ కోసం యుద్ధ విమానాల్లో ట్యాంకర్లను తెప్పించిన సంఘటనలున్నాయి. పది రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో బెడ్లు, ఆక్సిజన్ కోసం పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడింది. […]

Written By:
  • Srinivas
  • , Updated On : May 29, 2021 4:09 pm
    Follow us on

    కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న వేళ గతంలో కేసులు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం కసులు తగ్గినా మరణాల రేటు మాత్రం తగ్గడం లేదు. దీంతో ప్రజలు భయాందోళన వ్యక్త్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా తగ్గుతోంది. కరోనా కేసులు లేకపోయినా ఆక్సిజన్ మరణాలు మాత్రం ఎక్కడా నమోదు కావడం లేదు. ఆక్సిజన్ కోసం యుద్ధ విమానాల్లో ట్యాంకర్లను తెప్పించిన సంఘటనలున్నాయి. పది రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో బెడ్లు, ఆక్సిజన్ కోసం పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడింది.

    జూన్ 10 నాటికి తెలుగు రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ ప్రభావం తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. లాక్ డౌన్, కర్ఫ్యూ నిబంధనలు మరో వారం రోజుల పాటు పొడిగిస్తారని తెలుస్తోంది. పూర్తిగా తగ్గేవరకు ఆంక్షలు ఉండాలని తెలుస్తోంది. ఆక్సిజన్ విషయంలో ప్రభుత్వాలు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. విదేశాల నుంచి పె ద్ద ఎత్తున క్రయోజనిక్ ట్యాంకర్లు కొనుగోలు చేశారు. ఏపీ ప్రభుత్వం తరఫున బడా కాంట్రాక్టులు పొందిన సంస్థలు ఆక్సిజన్ సంబంధిత పరికరాలు తెప్పించడంలో సాయం చేశాయి.

    చిరంజీవి లాంటి వారు ఆక్సిజన్ బ్యాంకుల్ని ఏర్పాటు చేశారు. సోనూసూద్ లాంటి వారు నేరుగా ప్లాంట్లనే ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ సప్లయ్ పెరిగింది. డిమాండ్ తగ్గింది. మూడో వేవ్ ఉంటుందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటి వరకు ఆక్సిజన్ మౌలిక సదుపాయాలు ముందు ఎంతో ఉపయోగపడతాయని అంచనా వేస్తున్నారు.

    కరోనా వేళ ఆక్సిజన్ అవసరం పెరిగింది. చాలా చోట్ల ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోయిన సందర్బాలు సైతం ఉన్నాయి. దీంతో ఆక్సిజన్ ప్రాధాన్యత పెరిగింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఆక్సిజన్ అవసరం రెట్టింపయ్యింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఆక్సిజన్ లెవల్స్ తోనే టెస్టులు చేయించుకునే స్థాయికి వెళ్లారు. ప్రభుత్వాలు స్పందించి ఆక్సిజన్ ట్యాంకులను తెప్పించాల్సిన అవసరం ఏర్పడింది.