- Telugu News » Ap » Rahul murder case vijay kumar in police custody
Rahul murder case: రాహుల్ హత్య కేసు.. పోలీసుల అదుపులో విజయ్ కుమార్
యువ పారిశ్రామిక వేత్త రాహుల్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అనుమానితులను అదుులోకి తీసుకొని విచారిస్తున్నారు. గతంలో హైదరాబాద్ లో జరిగిన వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసులో కీలక నిందితుడైన శ్యామ్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు నిన్న అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఇవాళ కోరాడ విజయ్ కుమార్ ను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో మిగతా నిందితుల కోసం పోలీసులు అయిదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వివిధ నగరాల్లో […]
Written By:
, Updated On : August 22, 2021 / 04:23 PM IST

యువ పారిశ్రామిక వేత్త రాహుల్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అనుమానితులను అదుులోకి తీసుకొని విచారిస్తున్నారు. గతంలో హైదరాబాద్ లో జరిగిన వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసులో కీలక నిందితుడైన శ్యామ్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు నిన్న అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఇవాళ కోరాడ విజయ్ కుమార్ ను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో మిగతా నిందితుల కోసం పోలీసులు అయిదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వివిధ నగరాల్లో గాలిస్తున్నారు. తన వాటా కోసం విజయ్.. రాహుల్ పై ఒత్తిడి తెచ్చారని రాహుల్ తండ్రి రాఘవరావు పోలీసులకు ఫిర్యాద చేసిన విషయం తెలిసిందే.