
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు. పోలవరం నిర్వాసితుల పేరుతో అక్రమాలు జరుగుతున్నట్లు కేంద్ర మంత్రికి ఆయన ఫిర్యాదు చేశారు. నకిలీ ఖాతాలతో నిర్వాసితుల సొమ్ము కాజేస్తున్నారని లబ్ధిదారులను పక్కన పెట్టి నకిలీలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఫిర్యాదులో రఘురామ పేర్కొన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో అదనపు నిధులు కేటాయిస్తున్నారని కేటాయింపులు పెంచి 25 శాతం వరకు కమీషన్లు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.