బీజేపీ పాలిత రాష్ర్టాలకేనా వ్యాక్సిన్?

కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందరికి వ్యాక్సిన్లు వేయాలని నిర్ణయించుకుంది. రాష్ర్టాలు ఒక్కరూపాయి ఖర్చు పెట్టకుండా టీకాలు ఇస్తామని చెప్పింది. అంతవరకు బాగానే ఉంది. అయితే హఠాత్తుగా కేంద్రం వ్యాక్సిన్ విధివిధానాలు మార్చేసింది. 18 ఏళ్లు పైబడిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలా వద్దా అనేది రాష్ర్టాలే నిర్ణయం తీసుకోవచ్చని ఆఫర్ ఇచ్చిన కేంద్రం పంపిణీని ఏ లెక్కలో చేపట్టాలో కూడా మార్చేసింది. వైరస్ తీవ్రత, జనాభా, వ్యాక్సినేషన్ పురోగతి రాష్ర్టాలకు టీకాలు పంపిణీ చేస్తామని స్పష్టం చేసింది. గతంలో […]

Written By: NARESH, Updated On : June 9, 2021 12:54 pm
Follow us on

కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందరికి వ్యాక్సిన్లు వేయాలని నిర్ణయించుకుంది. రాష్ర్టాలు ఒక్కరూపాయి ఖర్చు పెట్టకుండా టీకాలు ఇస్తామని చెప్పింది. అంతవరకు బాగానే ఉంది. అయితే హఠాత్తుగా కేంద్రం వ్యాక్సిన్ విధివిధానాలు మార్చేసింది. 18 ఏళ్లు పైబడిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలా వద్దా అనేది రాష్ర్టాలే నిర్ణయం తీసుకోవచ్చని ఆఫర్ ఇచ్చిన కేంద్రం పంపిణీని ఏ లెక్కలో చేపట్టాలో కూడా మార్చేసింది. వైరస్ తీవ్రత, జనాభా, వ్యాక్సినేషన్ పురోగతి రాష్ర్టాలకు టీకాలు పంపిణీ చేస్తామని స్పష్టం చేసింది. గతంలో జనాభా ఆధారంగా పంపిణీ చేసేవారు. ఇప్పుడు వ్యాక్సిన్ వేస్టేజ్ ఎక్కువగా చేసే రాష్ర్టాలక తక్కువగా కేటాయిస్తామన్నారు.

వ్యాక్సిన్ల సరఫరాపై ఆయా రాష్ర్టాలక ముందే కేంద్రం సమాచారం ఇస్తుంది. వ్యాక్సిన్ లభ్యత సమాచారం పబ్లిక్ డొమైన్ లో అందబాటులో ఉంచాలని రాష్ర్టాలకు ఆదేశాలు ఇచ్చింది. కేంద్రం పంపే వ్యాక్సిన్ డోసులను ఏ రాష్ర్టమైనా వృథా చేస్తే దాని ప్రభావం తదుపరి కేటాయింపులపై ఉంటుందని కొత్త మార్గదర్శకాలలో వెల్లడించింది.

వ్యాక్సిన్ తయారీదారుల నుంచి 75 శాతం స్టాక్ ని కేంద్ర ప్రభుత్వం సేకరించనున్నది. కొత్తగా ప్రకటించిన పారామీటర్స్ అన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఏ రాష్ర్టానికి ఏ మేరకు వ్యాక్సిన్లు కేటాయించాలనే విషయాన్ని కేంద్రం నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది. కేంద్రం నిర్ణయాలు చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

బీజేపీ పాలిత రాష్ర్టాల్లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ర్టాలకు ఎక్కువగా తరలిస్తారని అనుమానిస్తున్నారు. ప్రైవేటు రంగానికి ఇరవై ఐదు శాతం వరకు సప్లయ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చినందుకు బీజేపీ శీతకన్ను వేసిన రాష్ర్టాల్లో ప్రజలకు కొనుగోలు చేసుకునేవే ఎక్కువగా అందబాటులో ఉండే ప్రమాదం ఉందన్న అంచనాలున్నాయి. ఇప్పటికి జనాభా ప్రకారం ఇస్తున్నామని చెప్పినప్పుడే పెద్ద ఎత్తున టీకాలు బీజేపీ పాలిత ాష్ర్టాలక వెళ్లనున్నాయి.