హైకోర్టులో ఎంపీ రఘురామకు గట్టి షాక్

నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు అరెస్ట్ అయిన ఘడియా బాగాలేనట్టుగా ఉంది. ఏపీ సీఎం జగన్ పై కత్తికట్టిన ఆయనను నిన్న ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై హైకోర్టుకెక్కిన రఘురామకు షాక్ తగిలింది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ ను విచారించిన హైకోర్టు ఈ పిటీషన్ ను కొట్టివేయడం విశేషం. తన అరెస్ట్ అక్రమం అని.. ఏపీ ప్రజల తరుఫునే తాను ప్రశ్నిస్తున్నందున బలవంతంగా […]

Written By: NARESH, Updated On : May 15, 2021 3:20 pm
Follow us on

నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు అరెస్ట్ అయిన ఘడియా బాగాలేనట్టుగా ఉంది. ఏపీ సీఎం జగన్ పై కత్తికట్టిన ఆయనను నిన్న ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై హైకోర్టుకెక్కిన రఘురామకు షాక్ తగిలింది.

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ ను విచారించిన హైకోర్టు ఈ పిటీషన్ ను కొట్టివేయడం విశేషం. తన అరెస్ట్ అక్రమం అని.. ఏపీ ప్రజల తరుఫునే తాను ప్రశ్నిస్తున్నందున బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని పేర్కొంటూ ఏపీ హైకోర్టులో ఎంపీ రఘురామ బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. కానీ ఆయనకు ఊరట దక్కలేదు.

రఘురామకృష్ణంరాజు తరుఫున సుప్రీంకోర్టు న్యాయవాది ఆదినారాయణ రావు వాదించారు. విచారణ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని అరెస్ట్ కు కారణాలు లేవని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

అయితే జిల్లా కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. కేసు తీవ్రత దృష్ట్యా హైకోర్టును ఆశ్రయించినట్టు కోర్టుకు తెలిపారు న్యాయవాది ఆదినారాయణ రావు. కింది కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు సూచించింది. రఘురామ వేసిన హౌస్ మోషన్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది.

అంతకుముందు ఎఫ్ఐఆర్ లో ఏపీ సీఐడీ కేసులను సుమోటోగా నమోదు చేసినట్టు పేర్కొంది. ఎంపీ వ్యాఖ్యలు, హావభావాల ద్వారా ప్రజల్లో విద్వేషభావం నింపేలా ప్రవర్తిస్తున్నారని.. ప్రజల్లో హింస ప్రజ్వరిల్లేలా వ్యవహరించారని పేర్కొంది. రెడ్డి, క్రిస్టియన్ సామాజికవర్గాల్ని లక్ష్యంగా చేసుకొని వారికి ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తోందని అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారని తెలిపింది. తద్వారా ఆయా వర్గాల మధ్య చిచ్చు రేపి ప్రభుత్వ వ్యతిరేకంగా కుట్ర చేశారని సీఐడీ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.

ఈ కేసులో ఏ1గా ఎంపీ రఘురామకృష్ణంరాజు పేరు చేర్చగా.. ఏ2గా రెండు మీడియా చానెల్స్ ను ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఈ రెండు చానెల్స్ రఘురామకృష్ణంరాజుతో కలిసి కుట్ర చేశాయనే అభియోగాన్ని సీఐడీ ఎఫ్ఐఆర్ లో నమోదు చేసింది.