Star Hero: కాపీ ఆరోపణలు చిత్ర పరిశ్రమలో కామన్. దర్శకుడు పలానా చిత్రం నుండి కథ, సీన్స్ లేపేశాడని, మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్స్ కాపీ కొట్టాడని మనం తరచుగా వింటూ ఉంటాం. దీన్ని కొందరు స్ఫూర్తి అని కవర్ చేసుకుంటారు. దేశం మెచ్చిన దర్శకుడు రాజమౌళి కూడా కాపీ ఆరోపణలు ఎదుర్కున్నాడు. ఇక టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా ఉన్న థమన్, దేవిశ్రీకి కూడా ఈ కాపీ అపవాదులు తప్పలేదు. అయితే దర్శకుడు సుకుమార్ గతంలో ఎన్నడూ కాపీ ఆరోపణలు ఎదుర్కొన్న సందర్భాలు లేవు. కథ, సన్నివేశాల్లో సుకుమార్ తన మార్క్ చూపిస్తాడు. ఒకరిని ఫాలో అవడం జరగదు.
అయితే పుష్ప చిత్రంలో హీరో మేనరిజం మీద మాత్రం కాపీ ఆరోపణలు తెరపైకి వచ్చాయి. పుష్ప పాత్ర చేసిన అల్లు అర్జున్ ఒక భుజాన్ని పైకి లేపి నడుస్తూ ఉంటాడు. నిజానికి అది అంగవైకల్యం కాదు. బాల్యంలో తనకు జరిగిన అవమానం కారణంగా పుష్పరాజ్ ఒక భుజం పైకి లేపి నడుస్తాడు. ఎవడైనా, ఏదైనా తగ్గేదిలేదు, అనుకున్నది చేయాల్సిందే అని పరోక్షంగా చెప్పే మేనరిజం అది. పుష్ప బ్లాక్ బస్టర్ కావడంతో పాటు పుష్ప రాజ్ కోసం వాడిన మేనరిజమ్స్ బాగా పాప్యులర్ అయ్యాయి.
అయితే ఈ భుజం లేపడం అనేది 19 ఏళ్ల క్రితమే ఓ హీరో చేశాడు. ఆయన ఎవరో కాదు రియల్ స్టార్ శ్రీహరి. 2002లో శ్రీహరి పృథ్వి నారాయణ టైటిల్ తో ఒక చిత్రం చేశాడు. అందులో ఆయనది డ్యూయల్ రోల్. ఈ చిత్రంలో ఒక సన్నివేశంలో పృథ్విరాజ్ భుజం పైకెత్తి నడుస్తూ డైలాగ్ చెబుతాడు. సినిమాలో చాలా చోట్ల ఆయన ఈ మేనరిజం ఫాలో అయ్యాడు. ఈ క్రమంలో శ్రీహరి మేనరిజం సుకుమార్ పుష్ప కోసం కాపీ చేశాడంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
అయితే ఇది కాపీ అనడానికి లేదు. పృథ్వి నారాయణ హిట్ మూవీ కాదు. అలాగే శ్రీహరి మేనరిజం ఏమంత పాపులర్ కాదు. సుకుమార్ ఆలోచన నుండి పుట్టిందే ఈ గూనె మేనరిజం. అదన్నమాట సంగతి. మరోవైపు పుష్ప 2 కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ ఆగస్టు 15న విడుదల కానుంది. దాదాపు రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో భారీగా నిర్మిస్తున్నారు. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
pushpa walking style
appatlone srihari gaaru ❤️ pic.twitter.com/4PJj9Y1Z1Z— celluloidpanda (@celluloidpanda) March 25, 2024