
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. లోహ, ఇన్ ఫ్రా, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు రాణించడం ఇందుకు దోహదం చేసింది. ఉదయం సెన్సెక్స్ 55,647 పాయింట్లు వద్ద లాభాల్లోనే ఆరంభమైనా, క్రమంగా స్వల్ప నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 55,536 పాయింట్ల వద్ద కనిష్ట స్థాయికి దిగివచ్చింది. అక్కడ కొనుగోళ్ల మద్దతు లభించడంతో మళ్లీ లాభాల్లోకి వచ్చింది. చివరకు 403 పాయింట్ల లాభంతో 55,958 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 128 పాయింట్లు పెరిగి 16,624 వద్ద స్థిరపడింది.