
భూకబ్జా ఆరోపణలు ఎదుర్కంటున్న మంత్రి ఈటల రాజేందర్ కు టీజేఎస్ అధినేత, ప్రొపెసర్ కోదండరాం మద్దతు తెలిపారు. కేసీఆర్ ను గద్దె దింపటానికి ఉద్యమకారులు ఏకం కావాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు. ఉద్యమకారులు విడి విడిగా ఉండటం వల్లనే కేసీఆర్ రెచ్చిపోతున్నాడని విమర్శించారు. కేసీఆర్ దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మించటానికి సిద్ధమవ్వాలన్నారు.