
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పేషెంట్లతో సమస్యలు వస్తున్నాయని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ అన్నారు. సరిహద్దుల్లో అంబులెన్స్ లను అడ్డుకుంటున్నారన్నదానిపై స్పందించిన ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ మేం ఎక్కడా అంబులెన్స్ లను అడ్డుకోవడం లేదన్నారు. ముందస్తుగా ఆస్పత్రుల్లో బెడ్లు బుక్ చేసుకున్న తర్వాతే రాష్ట్రంలోకి రావాలన్నారు. ఎవరైతే తెలంగాణ లో ఆస్పత్రిలో అడ్మిట్ అవ్వాలని అనుకుంటున్నారో వారు బెడ్ రిజర్వేషన్ లేకుండా నేరుగా వచ్చేసి ఐదారు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారని ఈ నేపథ్యంలో పేషేంట్లకు సరైన సమయంలో చికిత్స అందకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. దీనికి సంబంధించి ఆయా రాష్ట్రాలకు లెటర్ రాసినట్లు చెప్పారు.