Homeఎంటర్టైన్మెంట్అరె.. అరడజను చిన్న కథలకు గ్రీన్ సిగ్నల్ !

అరె.. అరడజను చిన్న కథలకు గ్రీన్ సిగ్నల్ !

సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం తిరిగే వారికీ ‘యువి క్రియేషన్స్’ ఇప్పుడు కల్పతరువులా కనిపిస్తోంది. ఛాన్స్ కావాలా ? మంచి కథతో రా, డైరెక్షన్ ఛాన్స్ ఇస్తాం అంటూ యువి బృందం వారు డైరెక్ట్ గానే కొత్త బ్యాచ్ కి ఆఫర్లు ఇస్తున్నారు. మిర్చి దగ్గర నుంచి సాహో వరకు భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయిన యువీ క్రియేషన్స్, ఎప్పటినుండో చిన్న సినిమాలు తీయాలని చాల ప్లాన్ చేసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే […]

UV Creationsసినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం తిరిగే వారికీ ‘యువి క్రియేషన్స్’ ఇప్పుడు కల్పతరువులా కనిపిస్తోంది. ఛాన్స్ కావాలా ? మంచి కథతో రా, డైరెక్షన్ ఛాన్స్ ఇస్తాం అంటూ యువి బృందం వారు డైరెక్ట్ గానే కొత్త బ్యాచ్ కి ఆఫర్లు ఇస్తున్నారు. మిర్చి దగ్గర నుంచి సాహో వరకు భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయిన యువీ క్రియేషన్స్, ఎప్పటినుండో చిన్న సినిమాలు తీయాలని చాల ప్లాన్ చేసుకుంటూ వస్తోంది.

ఈ క్రమంలోనే ప్రస్తుతం యువీ నుండి ఐదు చిన్న చిత్రాలు రాబోతున్నాయి. బిజినెస్ లో మారుతున్న పరిస్థితులకు తగ్గట్లు ఈక్వేషన్లు సరి చూసుకుని ముందుకుపోవాలనే సిద్ధాతాన్ని యువీ క్రియేషన్స్ సంస్థ పర్ఫెక్ట్ గా ఫాలో అవుతుంది. తనకున్న ట్రాక్ రికార్డును పక్కన పెట్టి, వరుసగా చిన్న సినిమాలు ప్లాన్ చేయడానికి ముఖ్య కారణం ఓటీటీనే అని యువి సంస్థ నుండి అందుతోన్న సమాచారం.

ఇప్పటికే దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ తో మినీ కథ అంటూ ఒక బోల్డ్ సినిమాను ప్రేక్షుకుల ముందుకు తీసుకొస్తోన్న యువీ క్రియేషన్స్, ప్రశాంత్ అనే కొత్త దర్శకుడితో మరో సినిమాని కూడా ఆల్ రెడీ స్టార్ట్ చేసింది. ఇవి కాక దాదాపు అరడజనుకు పైగా చిన్న కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇవన్నీ కూడా చిన్న చిత్రాలే కావడం విశేషం.

కేవలం ఓటీటీ ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాలను నిర్మిస్తోంది ఈ బడా నిర్మాణ సంస్థ. ప్రస్తుతం ఈ సంస్థ నుండి రానున్న భారీ సినిమా రాథేశ్వామ్ చివరి దశలో వుంది.

 

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper