Homeఎంటర్టైన్మెంట్ఎదగాలంటే కొన్ని చెయ్యక తప్పదు - రకుల్

ఎదగాలంటే కొన్ని చెయ్యక తప్పదు – రకుల్

సినిమా ఇండస్ట్రీలో నాలుగేళ్లు నటిగా పని చేస్తే చాలు, లోకం తీరు, మనుషుల ఆలోచనలు ఎలా ఉంటాయో స్పష్టంగా తెలుసుకోవచ్చు అంటుంటారు కొందరు నటీమణులు. మరి ‘రకుల్ ప్రీత్ సింగ్’ దాదాపు పదేళ్ల పాటు హీరోయిన్ గా ఉంటూ ఇండస్ట్రీలో ఎన్నో ఆటుపోట్లు తింది, ఎంతోమందిని దగ్గరగా చూసింది. స్టార్లతో నటించింది, చిన్నాచితకా హీరోలతోనూ చక్కగా ఆడిపాడింది. ఇంత అనుభవం ఉంది కాబట్టే.. ఇండస్ట్రీలో ఎవరితో ఎలా ఉండాలో అమ్మడుకి బాగా తెలుసు. ఇక తాజాగా రకుల్ […]

Rakulసినిమా ఇండస్ట్రీలో నాలుగేళ్లు నటిగా పని చేస్తే చాలు, లోకం తీరు, మనుషుల ఆలోచనలు ఎలా ఉంటాయో స్పష్టంగా తెలుసుకోవచ్చు అంటుంటారు కొందరు నటీమణులు. మరి ‘రకుల్ ప్రీత్ సింగ్’ దాదాపు పదేళ్ల పాటు హీరోయిన్ గా ఉంటూ ఇండస్ట్రీలో ఎన్నో ఆటుపోట్లు తింది, ఎంతోమందిని దగ్గరగా చూసింది. స్టార్లతో నటించింది, చిన్నాచితకా హీరోలతోనూ చక్కగా ఆడిపాడింది. ఇంత అనుభవం ఉంది కాబట్టే.. ఇండస్ట్రీలో ఎవరితో ఎలా ఉండాలో అమ్మడుకి బాగా తెలుసు.

ఇక తాజాగా రకుల్ ఇండస్ట్రీలో యవ్వారాల గురించి చెబుతూ.. ‘సినీ పరిశ్రమలో ఒక్కోసారి మొహమాటాల నుండి తప్పించుకోలేము, పైగా ఎవరికైనా అవి తప్పవు కూడా. సినిమా పరిశ్రమలో నెగ్గుకు రావాలంటే మనసుకు నచ్చనివి కూడా ఎంతో ఇష్టపడుతూ చెయ్యాల్సి ఉంటుంది. ‘నా కెరీర్ లో అన్ని సార్లు నేను కథ నచ్చిన తరువాతనే సినిమాలు ఒప్పుకోలేదు.

కొన్నిసార్లు కథ నచ్చదు. అయితే ఆ సినిమాలో ఆ సినిమాలో స్టార్ హీరో ఉండొచ్చు, లేదా పెద్ద డైరెక్టర్ ఉండొచ్చు, లేకపోతే పెద్ద బ్యానర్ లో ఆ సినిమా తీస్తూ ఉండొచ్చు. ఒక హీరోయిన్ ఇలాంటివి కూడా ఆలోచించుకొని సినిమాలు ఒప్పుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ముందే తెలిసిపోతుంది, ఆ సినిమా ఆడదు అని, అల తెలిసినప్పటికీ ఆ సినిమా చేయాల్సి వస్తోంది.

ఎందుకంటే ఇండస్ట్రీలో ఎదగాలంటే, మొహమాటం కోసం కొన్ని చెయ్యక తప్పదు. పైగా ఆ సినిమా చేస్తే ఎక్కువ డబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుంటే.. రెమ్యునరేషన్స్ విషయంలో హీరోయిన్స్ కి ఎక్కువ లాభం కలిగేది కూడా అలాంటి సినిమాల నుండే’ అంటూ తన జ్ఞానాన్ని, తన అనుభవాన్ని కొత్త బ్యూటీలకు వివరంగా చెప్పుకొచ్చింది రకుల్.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper