మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరిదే. ఆ అడుగుకు మరో అడుగు తోడైతే ప్రయాణం మొదలవుతుంది. ఆ ప్రయాణంలో ఎన్నో సవాళ్ళు ఉంటాయి. ప్రతిబంధకాలు ఉంటాయి. అడ్డు తగిలే రాళ్లు.. పాదాలను చీల్చే ముళ్ళు ఎదురవుతుంటాయి. వీటిని దాటుకొని ముందుకు సాగితేనే ప్రయాణం అద్భుతమవుతుంది. విజయం సాధ్యమవుతుంది. ఇవన్నీ దీర్ఘ దృష్టితో ఆలోచించి.. ముందడుగు వేశారు కాబట్టే ఈ రోజున తెలంగాణకు బొంత దామోదర్ రావు పాలు సరఫరా చేస్తున్నారు. తన ప్రియ కంపెనీ ద్వారా లక్షల మందికి పాలను అందిస్తున్నారు. ఇంతటి స్థాయి అందుకోవడంలో దామోదర్ రావు చేసిన కృషి మామూలుది కాదు. పాల వ్యాపారం అంతంతమాత్రంగా ఉన్న రోజుల్లో ఆయన దీర్ఘ ఆలోచన ఈ స్థాయి దాకా తీసుకొచ్చింది.

సరిగ్గా 21 సంవత్సరాల క్రితం..
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ప్రాంతంలో సరిగ్గా ఫిబ్రవరి 27 2004 న ప్రియా కంపెనీని దామోదర్ రావు ప్రారంభించారు. మొదట్లో ఆయనకు పాల వ్యాపారాన్ని భారీగా విస్తరించాలని కలలు ఉండేవి. ఒక కంపెనీ భారీగా ఎదగాలంటే కచ్చితంగా వినియోగదారుల నమ్మకాన్ని పొందాలి. అది జరగాలంటే కచ్చితంగా ఉత్పత్తిలో నాణ్యత ఉండాలి. నాణ్యత అనేదాన్ని పాటిస్తే కచ్చితంగా వినియోగదారులు బ్రహ్మరథం పడతారని దామోదర్ రావు నమ్మేవారు. తను నమ్మిన ఆ సూక్తిని ఆయన ఆచరించడం మొదలుపెట్టారు. 2004లో మొదలైన ప్రియా కంపెనీ దినదిన ప్రవర్తమానంగా ఎదిగింది. పోటీ సంస్థలను ధైర్యంగా ఎదుర్కొంది. ఇటువంటి హంగు ఆర్భాటాలు లేకుండానే సగటు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని సొంతం చేసుకుంది. అమ్మ పాలలోని స్వచ్ఛత, నాణ్యతను పాటించడం మొదలుపెట్టింది. దీంతో అనతి కాలంలోనే ప్రియా కంపెనీ వేగంగా విస్తరించింది. మొదట్లో వందల లీటర్లకే పరిమితమైన ఆ కంపెనీ సామర్థ్యం నేడు వేల లీటర్లకు చేరుకుంది. వందల కస్టమర్ల నుంచి లక్షల స్థాయికి ఎదిగింది. ప్రతిరోజు తెలంగాణ వ్యాప్తంగా 60+ లీటర్ల పాలను ప్రియా కంపెనీ విక్రయిస్తోంది. పోటీ సంస్థలు రకరకాల మాయలు చేస్తున్నప్పటికీ.. నాణ్యతను మాత్రమే పాటిస్తూ.. వినియోగదారుల మనసును గెలుచుకుంటున్నది.
ALSO Read : ఆదాయం.. ఆహ్లాదం.. ఆనందం.. ఈ మూడు ఎక్కడ దొరుకుతాయో తెలుసా?
నాణ్యత నూటికి నూరు శాతం..
ప్రియా సంస్థ విక్రయించే పాలల్లో నాణ్యత నూటికి నూరు శాతం ఉంటుంది. అచ్చం మన ఇళ్లల్లో మన సొంత గేదెల నుంచి తీసే పాల కంటే కూడా నాణ్యత అధికంగా ఉంటుంది. వినియోగదారులు చెల్లించే ప్రతి పైసాకు న్యాయం చేయడం ప్రియ సంస్థ పెట్టుకున్న నిబంధన. ఆ నిబంధనే ఆ సంస్థకు కొండంత బలం. ఇదే విషయాన్ని దామోదర్ రావు మొదటి నుంచి కూడా పాటించేవారు. అందువల్లే ప్రియా సంస్థ నేడు ఈ స్థాయికి ఎదిగింది. పాలల్లో అనేక రకాలైన ఫ్లేవర్లను అందజేయడంలో ప్రియా సంస్థ ఎప్పటికీ ముందుంటుంది. మార్కెట్ పరిస్థితులను, వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రియా సంస్థ ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేపడుతూ ఉంటుంది. అలాగని కృత్రిమ పదార్థాలను కలిపే దుస్సాహసానికి ప్రియా సంస్థ ఎప్పుడూ ప్రయత్నించదు.
ప్రారంభం నుంచి ఇవాల్టి వరకు అదే నాణ్యత..
ప్రారంభం నుంచి ఇవాల్టి వరకు కూడా ప్రియా సంస్థ నాణ్యతను మాత్రమే నమ్ముకున్నది. తన కస్టమర్లకు నాణ్యమైన పాలనే అందిస్తున్నది. ఇదేదో మేము చెబుతున్న ఊహగానం కాదు. వివిధ సంస్థలు ప్రియ సంస్థ పాలను పరీక్షించి ఇచ్చిన సర్టిఫికెట్లు. అందువల్లే ప్రియా సంస్థ అంటే వినియోగదారులు అమితమైన ఆసక్తిని ప్రదర్శిస్తారు. ఆ పాలను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. పోటీ సంస్థలు పాలను ఎక్కడి నుంచో సేకరించి.. కృత్రిమ పద్ధతులలో వాటిని నిలువ చేసి వినియోగదారులకు అందిస్తారు. కానీ ప్రియ సంస్థ అలా కాదు.

సొంత పశువుల కేంద్రాలు
ప్రియా సంస్థకు సొంత పశువుల కేంద్రాలు ఉన్నాయి. వాటి నుంచి పాలను సేకరిస్తారు. వాటికి 23 పరీక్షలు నిర్వహించి.. ఆ తర్వాత అత్యంత పటిష్టమైన పద్ధతుల మధ్య పాలను ప్యాకింగ్ చేస్తారు. ఈ ప్రాసెస్లో ఎక్కడ కూడా కృత్రిమ పదార్థాలను ఉపయోగించరు. కేవలం గేదె పాలు మాత్రమే కాదు, ఆవు పాలు కూడా ఈ సంస్థ విక్రయిస్తోంది.. వినియోగదారులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో అవుట్లెట్లను ఆహ్వానిస్తోంది ప్రియా సంస్థ. అంతేకాదు పోటీ సంస్థల కంటే మెరుగైన కమీషన్ ఇస్తోంది. ప్రియా సంస్థల పాల ఉత్పత్తుల విక్రయించడానికి అవుట్లెట్ కోసం 9394044303 నెంబర్లో సంప్రదించవచ్చు.
