
హఠాత్తుగా ఓ ఆన్ లైన్ సమావేశంలో ప్రత్యేక్షమై కొందమంది సీబీఎస్ఈ విద్యార్థులను ప్రధాని నరేంద్ర మోదీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఆన్లైన్ లో ఓ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంపై అధికారులు వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈలోగా అనుకోకుండా ప్రధాని మోదీ ఈ సమావేశానికి హాజరై అందర్నీ ఆశ్చర్యపరిచారు. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేలా కొద్దిసేపు మాట్లాడారు.