Modi Dalai Lama Birthday: భారత్ చైనా మధ్య ఇటీవల కాలంలో దలైలామా వారసుడి అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా 90వ జన్మదిన వేడుకల హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో అట్టహాసంగా జరగ్గా.. ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే జన్మదిన వేడుకలకు భారత ప్రతినిధులు హాజరయ్యారు. వీటి పై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. టిబెట్ సంబంధిత అంశాలపై బీజింగ్ అభిప్రాయాలను న్యూదిల్లీ పరిగణనలోకి తీసుకోవాలని వ్యాఖ్యనించింది.