
దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్ల కొరత వెంటాడుతుండటం పై ఎయిమ్స్ చీఫ్ రణ్ దీప్ గులేరియా స్పందించారు. రాబోయే రోజుల్లో వ్యాక్సిన్ల కొరత ఉండదని, మరో రెండు నెలల్లో భారీ సంఖ్యలో కరోనా వైరస్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. కరోనా మహమ్మారికి సంబంధించిన అంశాలపై మెదాంత చైర్మన్ డాక్టర్ నరేష్ ట్రెహన్ తో ఆయన సంప్రదింపులు జరిపారు. విదేశాల నుంచి కూడా భారత్ కు కరోనా వ్యాక్సిన్లు రానున్నాయని ఎయిమ్స్ చీఫ్ వెల్లడించారు.