Pralhad Joshi Chandrababu: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలో సోలార్ ప్రాజెక్టులు, ప్రధాని సూర్యఘర్ పథకం అమలుపై ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు చర్చించారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలతో కలిసి సమావేశమయ్యారు. కేంద్రం సహకారంతో విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని చంద్రబాబు తెలిపారు.