Prakash Raj non bailable warrant : ఆమధ్య కర్ణాటక రాష్ట్రంలో ధర్మస్థల వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అది కాస్త దేశంలోనే సంచలనం కలిగించింది. ఆ తర్వాత ఈ ఎపిసోడ్ లోకి ప్రకాష్ రాజ్ ప్రవేశించారు. తీవ్రాతీతీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.. అక్కడితోనే ఆగిపోలేదు.. హిందువుల మీద.. హిందూ ధర్మం మీద దారుణంగా మాట్లాడారు. జస్ట్ ఆస్కింగ్ పేరుతో ధర్మస్థల అంశం మీద ఏదో ఒక విషయాన్ని ప్రకాష్ రాజ్ తెర పైకి తీసుకొచ్చేవారు.
అప్పట్లో ధర్మస్థల వివాదానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నప్పటికీ.. ప్రకాష్ రాజ్ ఊరుకునేవారు కాదు. దీనికి తోడు ఆ ఆలయంలో పనిచేసిన చిన్నయ్య మరింత వివాదాన్ని కలిగించే విషయాలను చెప్పడంతో ప్రకాష్ రాజ్ ఇంకా ఎక్కువ రెచ్చిపోయేవారు. దీంతో ధర్మస్థల ఆలయ ప్రాశస్త్యం చాలావరకు దెబ్బతిన్నది. దీనికి తోడు కొన్ని మీడియా సంస్థలు కావాలని నెగిటివ్ స్టోరీస్ పబ్లిష్ చేసేవి.
ధర్మస్థల వివాదం మీద ఇప్పుడు ఒక క్లారిటీ రావడంతో.. ప్రకాష్ రాజ్ అసలు రంగు బయటపడుతోంది. దీనికి తోడు చిన్నయ్య కూడా కీలక విషయాలను చెప్పడంతో.. ఈ వ్యవహారం వెనుక పెద్ద వ్యవస్థీకృత ముఠా ఉన్నట్టు అందరికీ అర్థమవుతోంది. దీని వెనక భారీగానే డబ్బులు చేతులు మారాయని సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించి ఇటీవల ప్రకాష్ రాజ్ బెంగళూరులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే మధ్యలో వదిలి వెళ్ళిపోయారు.
ఇప్పుడిక ప్రకాష్ రాజ్ వ్యవహారం మరో మలుపుతీసుకుంది. ఆయన మీద నాన్ బెయిలబుల్ వారంటీ నమోదయింది. ఆయన ఏకంగా నాలుగు రాష్ట్రాలలో ఓటర్ గుర్తింపు కార్డులు కలిగి ఉన్నారంటూ కేసు దాఖలయింది. 48వ ఏసీజేఎం కోర్టు శనివారం ప్రకాష్ రాజ్ కు వారెంట్ జారీ చేసింది. ప్రకాష్ రాజ్ పలచోట్ల ఓట్ హక్కు కలిగి ఉన్నారంటూ దిలీప్ కుమార్ అనే లాయర్ 2019లో బెంగళూరు నగరంలో హలసూరు గేటు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆయన బిబి ఎంపీ.. కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ స్పందన లేకపోవడంతో కోర్టులో పిటిషన్ వేశారు. ప్రకాష్ రాజ్ తమిళనాడు.. ఆంధ్ర ప్రదేశ్.. కర్ణాటక.. తెలంగాణ రాష్ట్రాలలో ఓటు హక్కులు కలిగి ఉన్నారని దిలీప్ కుమార్ ఆరోపిస్తున్నారు. అయితే ఈ కేసు విచారణకు ప్రకాష్ రాజ్ హాజరు కాకపోవడంతో కోర్ట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం విశేషం.
