Homeఎంటర్టైన్మెంట్Lenin Movie Release Delay: లెనిన్ పోస్ట్ పోన్ అయిన కూడా కష్టమేనా..?

Lenin Movie Release Delay: లెనిన్ పోస్ట్ పోన్ అయిన కూడా కష్టమేనా..?

Lenin Movie Release Delay: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి హీరో ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటూ ముందుకు దూసుకెళ్తూన్నాడు. ప్రస్తుతం వాళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో సైతం ఎక్కువ కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నారు. అయితే అఖిల్ మాత్రం దానికి పూర్తి భిన్నంగా ముందుకు సాగుతున్నాడు. ఆయన ఇండస్ట్రీకి వచ్చి 10 సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటివరకు ఒక్క సక్సెస్ ని […]

Lenin Movie Release Delay: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి హీరో ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటూ ముందుకు దూసుకెళ్తూన్నాడు. ప్రస్తుతం వాళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో సైతం ఎక్కువ కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నారు. అయితే అఖిల్ మాత్రం దానికి పూర్తి భిన్నంగా ముందుకు సాగుతున్నాడు. ఆయన ఇండస్ట్రీకి వచ్చి 10 సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటివరకు ఒక్క సక్సెస్ ని కూడా సాధించలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో సక్సెస్ ని అందుకున్న కూడా అది భారీ సక్సెస్ గా కన్వర్ట్ కాలేకపోయింది.

కాబట్టి ఇప్పుడు ఆయన చేయబోతున్న లెనిన్ సినిమా మీద భారీ అంచనాలైతే పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమా జూన్ 26వ తేదీనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ సినిమా వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో జులై 10వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టుగా అఫిషియల్ గా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. ఇక లెనిన్ మూవీ జూలై 10వ తేదీన వచ్చినప్పటికి ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తుంది అనేది తెలియాల్సి ఉంది.

మొత్తానికైతే లెనిన్ సినిమాతో అఖిల్ తన లక్ ను టెస్ట్ చేసుకోబోతున్నాడు. ఈ సినిమా కనక తేడా కొడితే మాత్రం అఖిల్ ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి బయటికి వెళ్లిపోయే అవకాశం ఉంది. అందుకే ఆచితూచి మరి ఈ సినిమాని చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా సక్సెస్ అనేది అఖిల్ కి చాలా కీలకంగా కాబోతుంది… ఇక ఈ సినిమా తర్వాత కూడా అతని చేయబోయే సినిమా ఏంటి అనేది ఎవరికీ తెలియడం లేదు. ఈ సినిమా సక్సెస్ అయితే అతనితో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శకులు ఆసక్తి చూపించే అవకాశాలైతే ఉన్నాయి. ఒకవేళ తేడా కొడితే మాత్రం ఆయన షెడ్డు కి వెళ్ళిపోవాల్సిందే అంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం హెచ్చరిస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper