Prabhas Spirit Movie : రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) కెరీర్ లో అత్యంత భారీ అంచనాల నడుమ విడుదలైన సినిమాల్లో ఒకటి ‘సలార్’. ప్రభాస్ అభిమానులతో పాటు ఇతర హీరోల అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూసారు. మళ్లీ ఆ రేంజ్ అంచనాలు స్పిరిట్(Spirit Movie) చిత్రం పై ఏర్పడింది. యానిమల్ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత సందీప్ వంగ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా కావడం తో ఈ చిత్రం పై టాలీవుడ్ లోనే కాదు, బాలీవుడ్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఎక్కువ అప్డేట్స్ వదలకుండా చాలా సర్ప్రైజ్ ని మైంటైన్ చేస్తూ వచ్చారు. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రావడం విశేషం. గత మూడు రోజుల నుండి హైదరాబాద్ లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతూ ఉంది.
ఈ షూటింగ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా రెగ్యులర్ గా పాల్గొంటున్నాడు. నిన్నటి షూటింగ్ లోని ప్రభాస్ కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో లో ప్రభాస్ పోలీస్ గెటప్ లో కనిపించాడు. తన కెరీర్ మొత్తం మీద ప్రభాస్ ఇదే తొలిసారి పోలీస్ గెటప్ లో కనిపించడం. సరిగా క్లారిటీ లేని వీడియో లోనే ఈ రేంజ్ లో ఉన్నాడు. ఇక ఫస్ట్ లుక్ విడుదలైతే ఎలా ఉంటాడో అని అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో లో ప్రభాస్ సందీప్ వంగ తో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతకీ ఏమి మాట్లాడాడు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కానీ అభిమానులు మాత్రం తమకు తోచిన విధంగా ఫన్నీ సంభాషణలు సోషల్ మీడియా లో షేర్ చేసుకుంటున్నారు.
ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా త్రిపాఠి దిమిరి నటించబోతుంది. అదే విధంగా విలన్ గా వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నాడు. ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పవర్ ఫుల్ క్యామియో రోల్ లో కనిపిస్తాడని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న వార్త. ఇందులో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. సందీప్ వంగ ని ఒక ఈవెంట్ లో యాంకర్ ఈ విషయం గురించి అడిగినప్పుడు అలాంటిది ఏమి లేదు, చిరంజీవి తో నేను చేస్తే ఫుల్ లెంగ్త్ సినిమా మాత్రమే చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. కానీ ఆయన క్యామియో ని సర్ప్రైజ్ గా ఉంచేందుకే సందీప్ వంగ సోషల్ మీడియా లో ప్రచారమైన ఆ వార్త రూమర్ అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసాడని అంటున్నారు. ఇందులో ఏది నిజమో, ఏది అబద్దమో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.
Guess the conversation.
#Spirit #Prabhas
#Sandeepreddyvanga pic.twitter.com/zcanovRSU6— (@VickyyRoxx) November 30, 2025