Prabhas Ram Charan : నవంబర్ నెల టాలీవుడ్ కి ఎంతో స్పెషల్ కాబోతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Rajinikanth),రాజమౌళి(SS Rajamouli) సినిమాకు సంబంధించిన ఒక కీలక అప్డేట్ గ్రాండ్ గా రివీల్ కాబోతుంది. దీని కోసం టాలీవుడ్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ ఈవెంట్ కి అవతార్ మూవీ డైరెక్టర్ జేమ్స్ కెమరూన్ కూడా రాబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఆ రోజు ఆయన చేత టైటిల్ ని రివీల్ చేయించడమే కాకుండా, ఒక గ్లింప్స్ వీడియో ని కూడా విడుదల చేయించబోతున్నారట. దీని తర్వాత ప్రభాస్(Rebel Star Prabhas), రామ్ చరణ్(Global Star Ram Charan) వరుసగా తమ అభిమానులకు ట్రీట్ ఇవ్వబోతున్నారు. ప్రభాస్ ప్రస్తుతం ‘రాజా సాబ్’ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. టాకీ పార్ట్ మొత్తం పూర్తి అయ్యింది కానీ, సాంగ్స్ చిత్రీకరణ మాత్రం బ్యాలన్స్ ఉండిపోయింది.
ప్రస్తుతం ఆ సాంగ్స్ చిత్రీకరణ పనిలో ఉంది మూవీ టీం. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యాయి. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలోని మొదటి లిరికల్ వీడియో సాంగ్ ని నవంబర్ మొదటి వారం లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అట. ఓజీ మూవీ మ్యూజిక్ తో యూత్ ఆడియన్స్ ని ఒక ఊపు ఊపిన థమన్, ఈ చిత్రానికి కూడా సంగీతం అందించాడు. ప్రభాస్ కి మొట్టమొదటిసారి పనిచేయడంతో ది బెస్ట్ ఇచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నం చేసాడట థమన్. మొదటి పాటతోనే సిక్సర్ ని కొట్టాలి, ఆడియన్స్ దృష్టిని ఆకర్షించాలి అనే లక్ష్యం తో ఉంది మూవీ టీం. అందుకు తగ్గట్టు గానే మొదటి పాటని డిజైన్ చేశారట. ఇందులో ప్రభాస్ డ్యాన్స్ కూడా మేజర్ హైలైట్ గా ఉండబోతుందని టాక్.
మరోపక్క గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా తన అభిమానులకు స్వీట్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం బుచ్చి బాబు తో ఆయన ‘పెద్ది’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు AR రెహమాన్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి లిరికల్ వీడియో సాంగ్ ని కూడా నవంబర్ నెలలోనే విడుదల చేయబోతున్నారట. అలా నవంబర్ లో స్టార్ హీరోల సినిమాలు విడుదల కాకపోయినా, వాళ్ళ కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ తో అభిమానులను వరుసగా ఉక్కిరిబిక్కిరి చేయబోతున్నారు. ‘రాజా సాబ్’ చిత్రం జనవరి 9 న విడుదల కాబోతుండగా, ‘పెద్ది’ చిత్రం మార్చి 26 న విడుదల కాబోతుంది.