Samantha Ruth Prabhu : ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత(Samantha Ruth Prabhu), సోషల్ మీడియా లో మాత్రం నిత్యం యాక్టీవ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తూ అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూనే ఉంటుంది. అయితే గత కొంతకాలం నుండి ఈమె ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు(Raj Nidimoru) తో ప్రేమాయణం నడుపుతుంది. ఈ విషయాన్ని ఆమె అధికారికంగా ప్రకటించలేదు కానీ, అభిమానులకు అనధికారికంగా ఎప్పటికప్పుడు హింట్స్ ఇస్తూనే ఉంది. రాజ్ తో కలిసి ప్రైవేట్ పార్టీలకు వెళ్లడం, వరల్డ్ టూర్స్ కి వెళ్లడం వంటివి రెగ్యులర్ గా చేస్తూనే ఉంది సమంత. రీసెంట్ గా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. రాజ్ ఇంట్లోనో,లేకపోతే ఇంట్లోనే తెలియదు కానీ, వీళ్లిద్దరు కలిసి ఒక చోట దీపావళి సంబరాలు చేసుకున్నారు.
వీళ్ళతో పాటు పలువురు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అంటే ప్రస్తుతం వీళ్లిద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు, లివింగ్ రిలేషన్ షిప్ లో ఉంటున్నారు అనేది నిన్నటితో నూటికి నూరు శాతం స్పష్టమైంది. మరి పెళ్లి చేసుకుంటారా?, లేకపోతే ఇలాగే లివింగ్ రిలేషన్ షిప్ ని కొనసాగిస్తారా అనేది తెలియదు కానీ, మా అభిమాన హీరోయిన్ కి ఒక తోడు దొరికింది అంటూ సోషల్ మీడియా లో ఆమె అభిమానులు సంతోషిస్తున్నారు. వీళ్లిద్దరి పరిచయం ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ తో మొదలైంది. ఈ సిరీస్ లో సమంత విలన్ క్యారక్టర్ లో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ విడుదల సమయం లోనే ఆమెకు నాగ చైతన్య తో విడాకులు జరిగింది. వీళ్ళిద్దరిలో తప్పు ఎవరు చేసారో స్పష్టంగా తెలియదు కానీ, ఇద్దరి పైన అనేక అనుమానాలు ఉన్నాయి అనేది మాత్రం నిజం.
ఇక సమంత సినిమాల విషయానికి వస్తే, ఈ ఏడాది ఆమె నుండి ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. గత ఏడాది ఆమె నటించిన అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ విడుదలైంది. దీనికి ఆడియన్స్ నుండి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అంతకు ముందు సంవత్సరం లో ఆమె విజయ్ దేవరకొండ తో కలిసి నటించిన ‘ఖుషి’ చిత్రం విడుదలైంది. ఈ సినిమా తర్వాత ఆమె మళ్లీ వెండితెర పై కనిపించలేదు. ఈ ఏడాది లో ఆమె శుభం అనే చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా విడుదలై కమర్షియల్ గా మంచి సక్సెస్ అయ్యింది. ఇందులో సమంత చిన్న పాత్ర ద్వారా మన ముందుకొచ్చింది. కానీ అభిమానుల్లో మాత్రం సమంత ని మిస్ అవుతున్నాము అనే ఫీలింగ్ ఇప్పటికీ పోలేదు. చూడాలి మరి మళ్లీ ఈమె వెండితెర పై ఎప్పుడు కనిపించబోతుంది అనేది.