
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు తెలంగాణకు మరణశాసనం లాంటిదని ఆనాడే పీజేఆర్ హెచ్చరించారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొదట పోరాడింది జనార్దన్ రెడ్డి అని తలిపారు. ఆయన చనిపోయిన తర్వాత తెలంగాణ తరఫున బలంగా పోరాడే నేత లేకుండా పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా జలాల విషయంలో గళమెత్తినందుకే పీజేఆర్ ను వైఎస్ మంత్రివర్గంలోకి తీసుకోలేదన్నారు. దోమలగూడలోని పీజేఆర్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి ఆయన కుమారుడు విష్ణువర్దన్ రెడ్డిని కలిశారు. పీజేఆర్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.