
పోర్న్ రాకెట్ కేసులో నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను ఇటీవల ముంబాయి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తన భర్త అరెస్టయిన నాలుగురోజుల తర్వాత మొదటిసారి శిల్పాశెట్టి.. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ప్రముఖ రచయిత జేమ్స్ థర్బర్ నవలలోని ఓ పేరాని ఇందులో హైలైట్ చేశారు. ఇంకా బతికే ఉన్నందుకు అదృష్టవంతురాలిగా భావించి గట్టిగా ఊపిరిపీల్చుకో. గతంలో సవాళ్లు తట్టుకున్నాను.. అదే మాదిరిగా భవిష్యత్తులోనూ సవాళ్లు ఎదుర్కొంటాను ఈ రోజు నా జీవితాన్ని నేనే అనుభవించడానికి ఏదీ అడ్డుపడదు అని ఆమె పెట్టిన పోస్ట్ లో ఉంది.