Poonam Kaur Rahul Gandhi : సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే సెలబ్రిటీలతో ఒకరు పూనమ్ కౌర్(Poonam Kaur). ఈమె పేరు వినగానే మనకు ఆమె చేసిన సినిమాలకంటే, ఆమె వివాదాలే ఎక్కువగా గుర్తుకు వస్తుంటాయి. ట్విట్టర్ మరియు ఇన్ స్టాగ్రామ్ యాప్స్ లో సమయం దొరికినప్పుడల్లా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లపై పరోక్షంగా కామెంట్స్ చేస్తూ వాళ్ళ అభిమానులను రెచ్చగొడుతూ ఉంటుంది. ఈమె చేసే వ్యాఖ్యలు చూసిన ఎవరికైనా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ఈమెకు దారుణమైన అన్యాయం చేశారు అని అనిపించక తప్పదు. కత్తి మహేష్ ఆరోజుల్లో పవన్ కళ్యాణ్ పై ఆ స్థాయిలో విరుచుకుపడుతూ 8 నెలలు మీడియా చుట్టూ తిరగడం లో ఈమె పాత్ర కూడా కీలకం. ఈమెను రాజకీయంగా చాలానే ఉపయోగించుకున్నారు. ఈమెని అస్త్రంగా వాడుకొని పవన్ కళ్యాణ్ పై వైసీపీ ప్రభుత్వం మరియు ఆయన దురాభిమానులు తీవ్రంగా పవన్ కళ్యాణ్ పై ట్రోల్స్ చేసేవారు.
అయితే రీసెంట్ గా ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పిన నిజానిజాలు చూసి నెటిజెన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. ఒక పెద్ద పార్టీ కి చెందిన కడప నాయకుడు, ఒక ప్రముఖ హీరో పై నెగిటివ్ కామెంట్స్ చెయ్యాలని , లేని పక్షం లో నీ న్యూడ్ వీడియోలను విడుదల చేస్తామంటూ బెదిరించారని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా తనకు ఎంతో డబ్బు ఆఫర్ చేసారని, పార్టీ లో పదవులు కూడా ఇస్తామని చెప్పారని చెప్పుకొచ్చింది. కానీ నేను వాటికి దేనికి లొంగకుండా ఇలా నిలబడ్డానని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఈమెని బెదిరించిన ఆ రాజకీయ పార్టీ వైసీపీ నా?, పవన్ కళ్యాణ్ పై ప్రెస్ మీట్ పెట్టి పరువు తీయమని చెప్పింది వాళ్లేనా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.
ఇది ఇలా ఉండగా గతం లో ఈమె కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చేతులు పట్టుకొని నడుస్తుంది. ఈ ఫోటో ని సోషల్ మీడియా లో బాగా ఉపయోగించి, పూనమ్ కౌర్ రాహుల్ గాంధీ తో ఎఫైర్ పెట్టుకుందని, త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం చేశారు. దీని గురించి పూనమ్ మాట్లాడుతూ ‘నాకు పెళ్లి జరిగి, అబార్షన్ అయ్యింది . ఆ తర్వాత రాహుల్ గాంధీ తో ఎఫైర్ పెట్టుకుంది అంటూ ప్రచారం చేసిన సోషల్ మీడియా కు థాంక్స్ చెప్పుకోవాలి. నాకు అవ్వాల్సిన పెళ్లి అవ్వలేదని నేను బాధపడుతున్నాను. నా స్నేహితుడి తో పెళ్లి ఫిక్స్ అయ్యింది . ఇలాంటి రూమర్స్ వల్లే నా పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ఒకవేళ నేను రాహుల్ గాంధీతో ఎఫైర్ పెట్టుకొని ఉండుంటే, రాజకీయం గా నేను ఏ స్థానం లో ఉండేదానిని?, నా సినీ కెరీర్ ఎలా ఉండేది?, నేను ఏ పార్టీ తో లేను, ఉంటే ఈ విధంగా ఉండేదానిని కాదు’ అంటూ చెప్పుకొచ్చింది పూనమ్ కౌర్.