
తిరుమల శ్రీవారి ఆలయ కేంద్రంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు చాలా బాధాకరమని తెలంగాణ భాజపా అధ్యక్షుడు , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. మత విశ్వాసాలు, ఆచారవ్యవహారాల పట్ల రాజకీయ జోక్యంతో వివాదాలు చేయడం తగదని హితవు పలికారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆచారాలు, సంప్రదాయాలు, విశ్వాసాలు అనాదిగా వస్తున్నాయన్నారు. వాటిలోని లోటుపాట్లను విచారించేది.. శాస్త్ర పద్ధతుల్లో చర్చించేది స్వామీజీలు, పీఠాధిపతులని అన్నారు. ఈ వ్యవహారంలో రాజకీయ నేతలు తలదూర్చడం భావ్యం కాదని సంజయ్ అభిప్రాయపడ్డారు.