
తెలుగు సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా తెలుగు అమ్మాయిలకి పెద్దగా అవకాశాలు రావు అని ఎప్పటి నుండో ఆనవాయితీగా వినిపిస్తోన్న చాల సహజమైన మాట. అయితే ఈ మాటను బ్రేక్ చేసిన తెలుగు హీరోయిన్స్ కూడా కొంతమంది ఉన్నారు. కాకపోతే ఆ హీరోయిన్స్ లో ఒకరుఇద్దరు మాత్రమే ఆడపాదడపా ఛాన్స్ లు అందుకంటూ తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఎంత ప్రయత్నించినా స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఒక్క తెలుగు హీరోయిన్ కూడా ఈ జనరేషన్ లో ఎవ్వరూ కనిపించట్లేదు అంటే.. టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్ల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు.
Also Read: ఐశ్వర్యారాయ్ కుమార్తెగా జాన్వి కపూర్ !
చాలామందికి అందం అభినయం ఉన్నప్పటికీ స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయినవారే ఎక్కువమంది. ఈ పదేళ్ళల్లో చూసుకుంటే.. అంజలి, బిందుమాధవి, రితూ వర్మ, ఈషా రెబ్బా ఇలా చెప్పుకుంటూ పోతే ఆ లిస్టు పెద్దదే అవుతుంది. అంజలి, రితూ వర్మ లాంటి వారు తెలుగులో అవకాశాలు రావట్లేదు అని పక్క భాషల్లోకి వెళ్ళి అక్కడ గుర్తింపు తెచ్చుకుని, ఆ గుర్తింపుతో అక్కడి స్టార్ హీరోల సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా అవకాశాలు సాధించి ముందుకుపోతున్నారు. అయినా మన తెలుగు అమ్మాయిలు మాత్రం, తెలుగు సినిమాలకు మెయిన్ లీడ్ గా పనికిరారు, భాష రాని హీరోయిన్ నే ఇష్టపడతారు గానీ, తెలుగు మాట్లాడే అమ్మాయిలకు మాత్రం తెలుగులో ఎందుకు అవకాశం ఇవ్వరో.
అయితే ప్రస్తుతం తెలుగు హీరోయిన్లల్లో యాక్టివ్ గా ఉండే హీరోయిన్స్ లో ఈషా రెబ్బా ఒకటే కనిపిస్తోంది. ఈషా చాల సంవత్సరాలు నుండి స్టార్ డమ్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. క్రేజ్ ను పెంచుకోవడానికి సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య ఈషా రెబ్బా హాట్ స్టిల్స్ వదులుతుంది. అయితే ఈ తెలుగు బ్యూటీ చేస్తోన్న లస్ట్‌స్టోరీస్ వెబ్‌సిరీస్ నుండి ఓ లేటెస్ట్ అప్ డేట్ తెలిసింది. హిందీలో లస్ట్‌స్టోరీస్ వెబ్‌సిరీస్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే.
Also Read: డ్రగ్స్ కేసులో నమ్రత.. మీడియా సృష్టేనా?
ఈ వెబ్‌సిరీస్ లో అత్యంత బోల్డ్‌గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న కియారా ఆడ్వాణీ పాత్రలో ఈషా రెబ్బా నటిస్తోంది అనుకున్నారు ఇప్పటివరకూ. కానీ, ఈషా, భుమి పెడ్నేకర్ పాత్రలో నటిస్తోంది. లస్ట్‌స్టోరీస్ లో బెడ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించిన భుమి పెడ్నేకర్ కు మంచి డిమాండ్ క్రియేట్ అయింది బాలీవుడ్ లో. ఇప్పుడు ఆ పాత్రలో నటిస్తే.. తనకు స్టార్ డమ్ వస్తోందనే ఉద్దేశ్యంతో ఈషా రెబ్బా ఆ పాత్రలో నటిస్తోంది. మరీ బెడ్ సీన్స్ తోనైనా ఈషా రెబ్బాకి స్టార్ డమ్ వస్తోందేమో చూడాలి. స్టార్టింగ్ కాస్త బోల్డ్ గా ఉండే ఈ పాత్రను దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఇంకా బాగా తీర్చిదిద్దారట.