
పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన టైటిల్ సాంగ్ పై కొందరు ప్రశంసలు కురిపిస్తుంటే మరి కొందరు విమర్శలు చేస్తున్నారు. అయితే పాటలో పోలీసులని కించపరిచేలా రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాసారని తెలంగాణ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ పోలీసులు పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసులు అని తమ రక్షణ కోసం మాకు జీతాలు ఇస్తున్న ప్రజలు బొక్కలు మేం విరగ్గొట్టమని చురకలు అంటించారు డీసీపీ. పోలీసుల గురించి వివరించేందుకు రచయితకు ఇంతకంటే గొప్ప పదాలు దొరకనట్టు ఉన్నయని ట్వీట్ చేశారు. ఓ నెటిజన్ మీ రేంజ్ లిరిక్స్ అయితే కాదు అంటూ రామజోగయ్య శాస్త్రికి చురక అంటించాడు. స్పందించిన రామజోగయ్య శాస్త్రి నెక్ట్స్ టైమ్ బాగా రాస్తా తమ్ముడు అంటూ చెప్పుకొచ్చారు.