
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. నటి పాయల్ ఘోష్ ఫిర్యాదు మేరకు ముంబయిలోని వెర్సోవా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. గత కొన్ని రోజులుగా అనురాగ్‌పై కొందరు నటీమణులు లైంగిక వేధింపులు గురి చేస్తున్నారని అరోపణలు చేస్తున్నారు. అయితే నటి పాయల్ మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదైంది.