
పోలవరం ముంపు బాధితులను ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. పోలవరం ముంపు ప్రాంతాలు దేవిపట్నం, చిన్న భీంపల్లి, కొండమొదలు, గానుగుల గొంది, పెనికలపాడు, సీతారం, మంటూరు, తొయ్యేరు గ్రామాల్లో పునరావాస బాధితులను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలకు పునరావాసం కల్పించి, వారికి ఉపాధి చూపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
https://www.facebook.com/somuveerrajubjp/videos/505975300489922